ఉయ్యాలా జంపాలా.. ఉమాదేవి
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి.. టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో అభిమానుల్ని ఆకట్టుకున్న ప్రణవి మానుకొండ.. ఇప్పుడు ‘స్లమ్ డాగ్ హస్బెండ్’తో హీరోయిన్‌గా వెండితెరపై రీఎంట్రీ ఇస్తోంది.
image: instagram/ pranavi-manukonda
జులై 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఏ ఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పిట్టకథ’తో పరిచయమైన సంజయ్‌రావు హీరోగా నటిస్తున్నారు.
image: instagram/ pranavi-manukonda
ప్రణవి.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. 11 ఏళ్ల వయసున్నప్పుడు ప్రణవిని ఓ డైరెక్టరు చూసి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవకాశం ఇచ్చారు.
image: instagram/ pranavi-manukonda
అలా ‘రొటీన్ లవ్‌స్టోరీ’లో హీరోయిన్ చిన్నప్పటి పాత్రతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత ‘ఉయ్యలా జంపాలా’లో చిన్ననాటి హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమాతోనే బాగా ఫేమసయ్యింది.
image: instagram/ pranavi-manukonda
చాలాకాలం పాటు సీరియల్స్ షూటింగ్‌తో బిజీ బిజీగా గడిపింది. ‘పసుపు కుంకుమ’, ‘సూర్యవంశం’, ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘గంగ మంగ’ లాంటి సీరియల్స్‌తో ఈ సుందరి తెలుగింటి ప్రేక్షకులకు దగ్గరైంది.
image: instagram/ pranavi-manukonda
ఇన్నాళ్లు సీరియల్స్ షెడ్యూల్ వల్ల సినిమాలు చేయలేదని.. ఇకపై వెండితెరపైనే పూర్తిగా దృష్టి పెడతానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
image: instagram/ pranavi-manukonda
కన్నీళ్లు పెట్టుకునే సీన్ ఏదైనా చేయాలన్నప్పుడు ప్రణవి గ్లిజరిన్ వాడకుండానే ఆ సీన్ చేస్తుందట. ఈ విషయంలో మహానటి సావిత్రే తనకు ఆదర్శమంటోందీ భామ.
image: instagram/ pranavi-manukonda
ప్రస్తుతం బీబీఏ చదువుకుంటోన్న ప్రణవి.. చదువును కొనసాగిస్తూనే నటిగా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. తన వద్దకు కథలు బాగానే వస్తున్నా.. మంచివాటినే ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తానంటోంది.
image: instagram/ pranavi-manukonda
ఇటీవల ఈమెతో కలిసి సింగర్ నోయల్ ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై ‘హస్ట్‌లర్’ పేరుతో ఒక వీడియో పాటని కంపోజ్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది.
image: instagram/ pranavi-manukonda