టపాసులు కాలుస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!
ప్రమాదకరమైన, భారీ శబ్దం వచ్చే బాణసంచా జోలికి వెళ్లొద్దు.
Image: Unsplash
టపాసులు కాల్చేటప్పుడు పిల్లల్ని దగ్గరగా తీసుకురావొద్దు. వాళ్లను దూరంగానే ఉండనివ్వాలి.
Image: Pixabay
విద్యుత్ స్తంభాలు, తీగల వద్ద టపాసులు పేల్చొద్దు.
Image: Unsplash
నైలాన్ వస్త్రాలు ధరించి బాణసంచా కాల్చొద్దు. కాటన్ వస్త్రాలను మాత్రమే ధరించాలి.
Image: Unsplash
బాణసంచా కాల్చుతున్నప్పుడు ముఖం దగ్గరగా పెట్టొద్దు.
Image: Unsplash
టపాసులను ఒకసారి వెలిగించిన తర్వాత అవి పేలకపోతే వాటిని తిరిగి వెలిగించే ప్రయత్నం చేయొద్దు.
Image: Pixabay
నాణ్యమైన టపాసులను మాత్రమే కాల్చాలి. వీలైతే పర్యావరణహిత టపాసులను ఎంచుకోవడం ఉత్తమం.
Image: Unsplash
డ్రైనేజీల వద్ద టపాసులు పేల్చకూడదు. వాటి నుంచి కొన్ని హానికర రసాయనాలు వెలువడే అవకాశం ఉంది.
Image: Pixabay
ఇంట్లో కాకుండా ఆరు బయట బాణసంచా కాల్చండి. బకెట్‌తో నీళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుకోండి!
Image: Pixabay
బాణసంచా కాల్చిన తర్వాత చేతులను తప్పనిసరిగా సబ్బుతో కడుక్కోవాలి.
Image: Pixabay
టపాసుల శబ్దాలకు కుక్కల్లాంటి పెంపుడు జంతువులు భయపడతాయి. అందుకే వాటిని శబ్దాలు వినిపించని గదిలో కట్టేసి ఉంచండి. వీధి శునకాల్ని దూరంగా పంపించండి.
Image: Pixabay