జుట్టుకు రంగేస్తున్నారా?
వెంట్రుకలు తెల్ల బడుతున్నాయని కొందరు, ఫ్యాషన్ పేరుతో మరికొందరు జుట్టుకు రంగులు అద్దుతుంటారు. కానీ, దీనివల్ల కొన్ని అనర్థాలున్నాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Image: RKC
తెల్ల జుట్టుకు రంగు వేసుకోవడంతో వయసు తగ్గినట్టు కనిపించడం నిజమే కానీ.. నాణ్యమైన హెయిర్ డైని ఎంచుకోవాలి. లేదంటే ఇబ్బందులొస్తాయి.
Image: RKC
కొన్ని హెయిర్ డైల వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి.. ముందుగా చర్మ వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
Image: RKC
తొలిసారిగా జుట్టుకు రంగు వేసుకునే వారు చెవి వెనకభాగంతో కాస్తంత రంగు వేయాలి. రెండు రోజులు ఆగిన తర్వాత ఎలాంటి దురద, దద్దుర్లు లేకపోతే ఆ రంగు జుట్టుకు వేసుకోవచ్చు.
Image: RKC
రంగు వేసుకునే సమయంలో చేతులకు తొడుగులు వేసుకొవాలి. కళ్లలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Image: RKC
చాలా మంది ముందు జుట్టుకు రంగేసుకొని తల స్నానం చేస్తారు. నిజానికి, తలస్నానం చేసిన తర్వాత రంగు వేసుకొని శుభ్రం చేసుకుంటే మన్నికగా ఉంటుంది.
Image: RKC
రసాయనాలతో తయారు చేసిన జుట్టు రంగులను కాకుండా హెర్బల్ ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. వీటితో పెద్దగా ఇబ్బందులు రావు.
Image: RKC
మహిళలు హెన్నాలాంటి వాటిని వాడటంతో జుట్టును కాపాడుకోవచ్చు. అవి పడకపోతే మాత్రం జుట్టు బాగా రాలిపోతుంది.
Image: RKC
సాధ్యమయినంత వరకు చర్మానికి అంటుకోకుండా ఉండే రంగులను తీసుకోవాలి. ఇటీవల షాంపూ లాంటి హెయిర్‌డైలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
Image: RKC
కంటి జబ్బులున్నవారు, చర్మ సంబంధ వ్యాధులతో బాధ పడుతున్న వారు రంగులు వాడకపోతేనే మంచిది.
Image: RKC
యువత వివిధ రంగుల్ని ఒకేసారి వేసుకుంటారు. ఇది మంచిది కాదు.. జుట్టు తొందరగా ఊడిపోతుంది. బట్టతల వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Image: RKC