జోరు వానలో జాగ్రత్త సుమా!

వానాకాలంలో వాహనాలు నడపడం ఓ సవాలే. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అందుకే.. వాహనచోదకులు ఈ జాగ్రత్తలు పాటించాలి.

వర్షాకాలంలో అరిగిపోయిన టైర్లు వాడొద్దు. టైర్లకు పగుళ్లు వచ్చినా, ఉబ్బినా వెంటనే మార్చాలి. లేదంటే తడి రోడ్డుపై బండి జారుతుంది. 

వర్షంతో తడిసిన రోడ్లపై సడన్‌బ్రేక్‌ వేస్తే స్కిడ్‌ అవుతుంది. బండి అదుపుతప్పి కింద పడుతుంది. అందుకే, బ్రేక్‌ నెమ్మదిగా వేయాలి. 

బైక్‌పై వెళ్లే వారు హెల్మెట్‌, రెయిన్‌కోట్‌, గొడుగు, విలువైన వస్తువులు తడవకుండా వాటర్‌ ప్రూఫ్‌ బ్యాగ్స్‌ వెంట తీసుకెళ్లడం మేలు.

వాహనాలను రెగ్యులర్‌గా సర్వీసింగ్‌ చేయించాలి. ఇంజిన్‌ ఆయిల్‌ ఉందా? బ్రేక్స్‌ సరిగా పడుతున్నాయా లేదా చెక్‌ చేసుకోవాలి.

వర్షంలో ముందు ఏం వెళ్తున్నాయో కనిపించవు. అందుకే హెడ్‌లైట్స్‌ వేసుకోవాలి. ఫోర్‌ వీలర్‌ అయితే, కచ్చితంగా వైపర్‌ ఆన్‌ చేయాలి. 

వర్షకాలంలో రోడ్లపై గుంతలు ప్రమాదకరంగా మారుతాయి. అందుకే, తక్కువ వేగంతో ప్రయాణించాలి. అప్పుడే ప్రమాదం బారిన పడినా.. తీవ్రత తగ్గుతుంది.

వాహనానికి వాహనానికి మధ్య దూరం కచ్చితంగా పాటించాలి. తడిరోడ్డుపై బ్రేక్‌ వేసినప్పుడు జారి మరో వాహనాన్ని ఢీకొట్టే అవకాశముంది.

బయలుదేరే ముందే.. మీరు వెళ్లే చోట, దారిలో వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలి. భారీ వర్షం కురిస్తే ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. 

వాహనం ఎక్కే ముందు ఇంధనం సరిపడా ఉందోలేదో చెక్‌ చేయాలి. మార్గమధ్యంలో బండి ఆగితే.. వర్షంలో నెట్టుకెళ్లడం కష్టం అవుతుంది. 

కారు/బైక్‌లో ఎప్పుడూ ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌ ఉండేలా చూసుకోండి. అనుకోకుండా ప్రమాదంలో పడ్డా.. వైద్యసాయం అందేలోపు ప్రథమ చికిత్సకు వీలవుతుంది. 

మెదడుకు పదును పెట్టేద్దామిలా

గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్‌-10 ఫుడ్‌

పెళ్లి బంధం దృఢంగా మారాలంటే ఇవి పాటించాల్సిందే!

Eenadu.net Home