మందులు వేసుకుంటున్నారా? అయితే ఈ ఆహారం తినొద్దు!
మందులు వేసుకునే ముందు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవద్దు. వాటితో శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఎనర్జీ డ్రింక్‌తో పాటు మందులు వేసుకోవడంతో చెడు ప్రభావాన్ని చూపుతాయి. మందుల తీవ్రత తగ్గుతుంది.
image:RKC
కొంతమంది మద్యం తాగిన తర్వాత మందులను వేసుకుంటారు. అవి అసలే పని చేయవు. అంతే కాదు కాలేయానికి హాని కలిగిస్తుంది.
image:RKC
పొగతాగిన తర్వాత మందులను వేసుకోకూడదు. ధూమపానంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో మందులు పని చేయవు. కొన్ని రియాక్షన్ కూడా కావొచ్చు.
image:RKC
పాలతో మందులను తీసుకోవడం కూడా మంచిది కాదు. యాంటీబయోటిక్స్ పని చేయకుండా చేస్తుంది. పాలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం.. ఔషధాలు సరిగా పని చేయకుండా చేస్తాయి.
image:RKC
అధిక రక్తపోటును తగ్గించే మందులు వాడే వారు.. అధిక పొటాషియం ఉండే బంగాళదుంపలు, పుట్టగొడుగులు., చిలగడదుంపలకు దూరంగా ఉండాలి.
image:RKC
ఆకుకూరలు.. రక్తం గడ్డకట్టడం, అధిక రక్తస్రావం అరికట్టేందుకు వాడే మందులను పని చేయకుండా చేస్తాయి. బ్రోకలీలో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. వార్పరిన్ మందులు సరిగా పని చేయవు.
image:RKC
గుండె సంబంధ సమస్యలున్న వారు.. పొటాషియం ఉండే ఆకు, కూరగాయలను తీసుకోవద్దు. ఇవి తీసుకుంటే రక్త ప్రసరణపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.
image:RKC
కాలేయం, కిడ్నీలకు సంబంధించిన మందులను వేసుకునే సమయంలో మాంసం, చేపలు తినకుండా జాగ్రత్త పడాలి. అధిక మసాలాలు హానికరంగా మారుతాయి.
image:RKC
వైద్యులు రాసే మందులు తీసుకున్న తర్వాత వాటిని ఎలా వేసుకోవాలో వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. లేకుంటే అవి శరీరంపై చెడు ప్రభావం చూపిస్తాయి.
image:RKC