కిస్‌తో వస్తున్న ప్రీతి అస్రానీ.. ఎవరీమె!
‘ఏక్ ముర్గీ కో దో బచ్చే..’ అంటూ సోషల్ మీడియాలో ఓ వైరల్ వీడియో ఉంటుంది చూశారా? అందులో కనిపించే ప్రీతి అస్రానీ మనకు సుపరిచితురాలే. తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. ఆమె గురించి ఆసక్తికర విషయాలు.
సుమంత్ ‘మళ్లీ రావా’లో చిన్నప్పటి ‘అంజలి’గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ప్రీతి అస్రాని.
అంతకుముందే ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’, ‘గుండెల్లో గోదారి’ లాంటి సినిమాల్లో బాల నటిగా కనిపించి మెప్పించింది. ‘ఫిదా’ అనే షార్ట్ ఫిల్మ్ కూడా చేసింది.
‘అయోతి’, ‘ఎలక్షన్’తో కోలీవుడ్‌లో పేరు సంపాదించుకున్నా.. కథానాయికగా ఆమె తొలి సినిమా తెలుగులోనే. అదే ‘ప్రెజర్ కుక్కర్’.
ఆ సినిమా తర్వాత ‘ఏ: యాడ్ ఇన్ఫినిటిమ్’, ‘సీటీమార్’, ‘దొంగలున్నారు జాగ్రత్త’, ‘యశోద’ సినిమాల్లో కొన్ని కీలక పాత్రల్లో కనిపించింది.
ఇప్పుడు సతీష్ కృష్ణన్ తెరకెక్కిస్తున్న ‘కిస్’తో పలకరించనుంది. ఇటీవల వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. జూన్ 30న సినిమాను తీసుకొస్తారు.
‘పక్కింటి అమ్మాయి’గా తెలుగులో.. ‘మిన్నలే’తో తమిళంలో సీరియల్స్ చేసింది. ‘9 అవర్స్’, ‘వ్యూహం’, ‘సోషల్’ లాంటి వెబ్ సిరీసుల్లోనూ నటించింది.
1999లో గుజరాత్‌లో పుట్టింది. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసింది. తన కజిన్ అంజు అస్రాని సీరియల్ నటి. ఆమె ద్వారానే పరిశ్రమలోకి వచ్చింది.
ప్రీతికి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఎక్కడికి వెళ్లినా ఓ పుస్తకాన్ని తీసుకెళ్తుంది. షూటింగ్ గ్యాప్‌లోనూ చదువుతుంది..
గిటార్ ప్లే చేయడం ఇష్టం. దాని కోసం శిక్షణ కూడా తీసుకుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రైడ్, అల్లు అర్జున్ మూవీస్ తన ఫేవరెట్.