అందంతో పనేంటి.. బుర్రలో మ్యాటర్ ముఖ్యం
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా పరిచయమైన ప్రీతి పగడాల త్వరలో ‘పతంగ్’తో తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనుంది.
ప్రణీత్ పత్తిపాటి తెరకెక్కిస్తున్న ‘పతంగ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇందులో ఐశ్వర్య పాత్రలో ప్రీతి సందడి చేయనుంది.
పుట్టింది హైదరాబాద్..పెరిగింది అమెరికా.. సినిమాల మీద ఆసక్తితో భారత్‌కు వచ్చింది ప్రీతి. హిట్ కొట్టాకే యూఎస్ వస్తాను అని ఇంట్లో చెప్పింది.
కుటుంబంలో అందరూ ఇంజినీర్లు, డాక్టర్లే. అలాంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది ప్రీతి మాత్రమే.. నాన్నది కోఠి అమ్మది కాకినాడ. ఈమె పుట్టిన రెండేళ్లకే అమెరికా వెళ్లారు.
చదువు అమెరికాలో పూర్తిచేసిన ప్రీతి డాక్టర్ అవ్వాలనుకుంది. అయితే మధ్యలో ఆపేసి యాక్టర్ అయ్యింది.
సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. నాన్నే నా హీరో.. ‘నువ్వు యాక్టింగ్ చెయ్ కానీ.. షరతులు వర్తిస్తాయి’ అంటూ కండిషన్‌లు పెట్టారని చెప్పింది.
మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ప్రీతి ‘మిస్ ఇండియా యూఎస్ 2018’ అందాల పోటీల్లో రన్నరప్.
2022లో మేఘన అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రీల్స్, షార్ట్స్ పోస్టు చేసేది. అవే సినిమాల మీద ఆసక్తిని, అవకాశాల్నీ తెచ్చిపెట్టాయి.
కెరీర్ ప్రారంభంలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్న ప్రీతి ‘నటనకు అందంతో పనేంటి.. బుర్రలో మేటర్ ముఖ్యం. ఏదైనా కావాలంటే ఓపిగ్గా ఎదురు చూడాలి’ అని చెబుతోంది.
చిన్నప్పుడు చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఇష్టం. ‘ఇంట్లో అందరం కలసి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఎక్కువగా చూస్తాం’ అని చెప్పింది.
‘మాయాబజార్’, ‘మూగమనసులు’ ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు. ఖాళీగా ఉంటే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘దిల్’ రిపీట్ మోడ్‌లో చూసి ఎంజాయ్ చేస్తాను అని చెప్పింది ప్రీతి.