కంటి చూపుతో కట్టిపడేసే ప్రియ...

‘లవర్స్ డే‌’తో పాపులర్‌ అయ్యి చెక్‌ సినిమాతో తెలుగు ఇండస్ర్టీలోకి అడుగు పెట్టింది ప్రియ ప్రకాశ్‌ వారియర్‌. ఆ చిత్రంలో ఓరగా ప్రియ కన్ను కొట్టి కుర్రకారులో ఫాలోయింగ్‌ పెంచేసుకుంది. 

image:instagram/priya.p.varrier 

This browser does not support the video element.

 లవర్స్‌డే చిత్రంలోని మణిక్య మలరాయ పూవి అనే వీడియో పాట విడుదలతో రాత్రికి రాత్రే ఫేమసయింది ఈ భామ. దాదాపు 6 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ని ఒక్కరోజులో సంపాదించేసింది.

image:instagram/priya.p.varrier

ప్రస్తుతం ‘బ్రో’లో అలరించనుంది. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు. కేతికా శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జులై 28న విడుదల కానుంది. 

image:instagram/priya.p.varrier 

ఈ భామ 1999లో కేరళలో పుట్టింది. పై చదువులేమో త్రిస్సూర్‌లో సాగాయి. యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా పాడటమంటే ప్రియకి ఇష్టమట.

image:instagram/priya.p.varrier 

మోడల్‌గా 2017లోనే తన కెరియర్‌ని మొదలుపెట్టింది కేరళ కుట్టి. 2019లో వచ్చిన ‘లవర్స్‌డే’ తర్వాత టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ వరస అవకాశాలను అందిపుచ్చుకుంది.

image:instagram/priya.p.varrier 

‘చెక్‌’, ‘ఇష్క్‌’, ‘4ఇయర్స్‌’, ‘లైవ్‌’ వంటి పలు చిత్రాలతో ఆకట్టుకుంది ప్రియ. ‘శ్రీదేవి బంగ్లా’తో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది.  

image:instagram/priya.p.varrier 

 ప్రతి రోజూ డ్యాన్స్‌ చేస్తే శరీరమంతా ఉత్సాహంగా ఉంటుందని చెప్తుంది ఈ సుందరి. పాటలు వినడం, ట్రిప్పులకి వెళ్లడం వంటివి బాగా నచ్చుతాయట. 

image:instagram/priya.p.varrier 

ప్రియా ప్రకాశ్‌కి ఫొటోషూట్‌ అంటే చాలా ఇష్టమట. వివిధ వేషధారణల్లో ఫొటోలు దిగుతూ ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడే సోషల్‌ మీడియాలో పంచుకొని యువతను కట్టిపడేస్తుంది. 

image:instagram/priya.p.varrier 

ఈ మలయాళీ భామ పలు అందాల పోటీల్లో పాల్గొంది. అంతేకాకుండా సంప్రదాయ నృత్యం, సంగీతం కూడా నేర్చుకుంది. ఫైనల్స్‌ అనే మలయాళం సినిమాలో ఒక పాట పాడింది కూడా.

image:instagram/priya.p.varrier 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home