ఓజీ.. ఒరిజినల్ గ్లామర్!
నటి ప్రియాంక అరుళ్ మోహన్.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది.
Image: Instagram/Priyanka Mohan
పవన్ - సుజీత్ కాంబినేషన్‌లో ‘ఓజీ’ అనే పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. దీంట్లో పవన్‌కు జోడీగా ప్రియాంకను ఎంపిక చేసింది చిత్రబృందం.
Image: Instagram/Priyanka Mohan
త్వరలోనే ఈ భామ.. ‘ఓజీ’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
Image: Instagram/Priyanka Mohan
బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ అందాల సుందరి.. కన్నడ చిత్రం‘ఒంద్ కతే హెల్లా’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.
Image: Instagram/Priyanka Mohan
ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ భామ.. శర్వానంద్ ‘శ్రీకారం’లోనూ మెరిసింది.
Image: Instagram/Priyanka Mohan
శివకార్తికేయన్ ‘డాక్టర్’తో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. అదే హీరోతో ‘డాన్’లో మరోసారి కలిసి నటించింది. ‘ఈటీ’లో సూర్యకి జోడీగా కనిపించింది.
Image: Instagram/Priyanka Mohan
ప్రస్తుతం ఈ క్యూట్ హీరోయిన్.. తమిళ్‌లో ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’తోపాటు మరో చిత్రంలో నటిస్తోంది.
Image: Instagram/Priyanka Mohan
‘ఓజీ’లో పవన్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో ఆ సినిమాలు చేస్తూనే ఇందులో నటించడానికి ఒప్పేసుకుంది.
Image: Instagram/Priyanka Mohan
అందంగా.. అమాయకంగా కనిపించే ఈ భామకు సోషల్‌మీడియాలో భలే క్రేజ్ ఉంది. ఇన్‌స్టాలో ఈమెకు 4.3మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image: Instagram/Priyanka Mohan
ఓ వైపు సంప్రదాయ దుస్తుల్లో.. మరోవైపు హద్దులు దాటని మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించి కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Priyanka Mohan