ప్రియాంక.. అందాల చిలక

థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది నటి ప్రియాంక శర్మ. 

Image: Instagram/Priyanka Sharma

నరేశ్‌ అగస్త్య, వైవా హర్ష తదితరులు నటించిన ‘#మెన్‌టూ’లో ప్రియాంక హీరోయిన్‌గా నటించింది. 

Image: Instagram/Priyanka Sharma

టాలీవుడ్‌లో చిన్న సినిమాలు చాలానే చేసింది.. అందంతో, అభినయంతో మెప్పిస్తోన్నా.. కెరీర్‌లో మంచి హిట్‌ సాధించలేకపోయింది.

Image: Instagram/Priyanka Sharma

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 1993 మే 27న జన్మించిన ప్రియాంక.. మాస్‌ కమ్యూనికేషన్‌లో పీజీ చేసింది. 

Image: Instagram/Priyanka Sharma

సినిమాలపై ఆసక్తితో టాలీవుడ్‌కి వచ్చేసింది. తొలిసారి ‘బంధం రేగడ్‌’అనే ఇండిపెండెంట్‌ చిత్రంలో నటించింది ప్రియాంక.

Image: Instagram/Priyanka Sharma

‘తరువాత ఎవరు?’, ‘సరోవరం’, ‘డైహార్డ్‌ ఫ్యాన్‌’ తదితర చిత్రాల్లో నటించింది. 

Image: Instagram/Priyanka Sharma

యంగ్‌ హీరో నందు నటించిన ‘సవారి’తో కాస్త గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలోని ‘ఉండిపోవ నువ్విలా’ సాంగ్‌ హిట్‌ కావడంతో హీరోయిన్‌కీ గుర్తింపు దక్కింది.

Image: Instagram/Priyanka Sharma

ఆ తర్వాత సమంత నటించిన ‘యశోద’లో ఓ కీలక పాత్ర పోషించింది. కానీ, ఆ చిత్రం సక్సెస్‌ను అందుకోలేదు. 

Image: Instagram/Priyanka Sharma

ఎప్పటికైనా ఈ టాలీవుడ్‌లో మంచి అవకాశం, సక్సెస్‌ రాకపోవా.. అని ఈ నార్త్‌ బ్యూటీ ఎదురుచూస్తోంది.

Image: Instagram/Priyanka Sharma

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక.. తరచూ తన గ్లామరస్‌ ఫొటోలు పోస్టు చేస్తూ యూత్‌ను ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Priyanka Sharma

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home