ప్రియాంకచోప్రా మరదలు.. తెలుగు నాయికే

బాలీవుడ్‌ అగ్రతార ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్‌ చోప్రా, నీలమ్‌ ఉపాధ్యాయ వివాహ వేడుకలు మొదలయ్యాయి. పెళ్లికూతురు మనకు బాగా తెలిసిన ఆమెనే..

గతేడాది ఆగస్టులో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలో పెళ్లి జరగనుంది.

2012లో ‘మిస్టర్‌ 7’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగు కంటే ముందుగానే తమిళ చిత్రంలో అవకాశం వచ్చినా అది సెట్స్‌పైకి వెళ్లలేదు.

తెలుగులో అల్లరినరేశ్‌ ‘యాక్షన్‌ 3డీ’(2013), నారా రోహిత్‌ ‘పండగలా వచ్చాడు’(2018), ‘తమాషా’(2018) చిత్రాల్లో నటించింది.

తమిళంలో ‘ఉన్నోడు ఓరు నాల్‌’(2013), ‘ఓం శాంతి ఓం’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలు. 

నీలమ్‌ పుట్టింది ముంబయి(1993)లో. మహారాష్ట్రలో చదువుకుంది. ఫొటోగ్రఫీలో డిప్లొమా, బీఏ పూర్తి చేసింది.

నటన మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టి, ఎంటీవీ స్టైల్‌చెక్‌ కార్యక్రమంలో పాల్గొంది.

ఈ ప్రోగ్రాం వల్లే ఆమెకు తెలుగునాట సినీ అవకాశాలు వచ్చాయి.  

నీలమ్‌ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ పట్ల అధిక శ్రద్ధ వహిస్తుంది. సీజన్‌కి తగ్గట్టుగా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటుంది. ఫేవరెట్‌ ఫుడ్‌ నూడుల్స్‌..

‘చాక్లెట్స్‌, చాక్లెట్‌ కేక్‌, చాక్లెట్‌ షేక్స్‌... ఇలా చాక్లెట్‌తో చేసినవి ఏవైనా సరే.. కనపడితే కేలరీల గురించి ఆలోచించకుండా కడుపునిండా తినేస్తా’ అంటోంది.   

ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామం కంటే ఎక్కువగా స్విమ్మింగ్‌నే నమ్ముతుంది. దాని వల్ల కొత్త ఉత్సాహం వస్తుంది అని చెబుతోంది.  

బయోపిక్‌లతో మెప్పిస్తున్నారు!

‘కనుసైగలతోనే వలచింది..’ ఈమెనే!

మోడలింగ్‌ కోసం డిగ్రీ వదిలేశా

Eenadu.net Home