దేశీగర్ల్ టు గ్లోబల్ స్టార్..!
దేశీ గర్ల్ నుంచి గ్లోబల్ స్టార్‌గా మారింది నటి ప్రియాంక చోప్రా.
Image: Instagram/priyankachopra
‘బేవాచ్’తో మొదలైన ప్రియాంక హాలీవుడ్ ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది.
Image: Instagram/priyankachopra
తాజాగా రిచర్డ్ మ్యాడెన్‌తో కలిసి పీసీ నటించిన టీవీ సిరీస్ ‘సిటడెల్’ విడుదలైంది.
Image: Instagram/priyankachopra
స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఫలితం ఎలా ఉండనుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది.
Image: Instagram/priyankachopra
ఈ సిరీస్ విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా సిరీస్‌బృందం.. వివిధ దేశాల్లో పర్యటించింది.
Image: Instagram/priyankachopra
అమెరికాతోపాటు యుకే, ఇటలీలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రియాంక వాటికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Image: Instagram/priyankachopra
భారత్‌లోనూ ‘సిటడెల్’ సిరీస్ బృందం పర్యటించింది. ఈ క్రమంలో పీసీ.. ముంబయిలోని తన అభిమానులతో కలిసి సందడి చేసింది.
Image: Instagram/priyankachopra
స్వదేశంలో తను నటించిన హాలీవుడ్ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందంటూ పీసీ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టింది.
Image: Instagram/priyankachopra
ప్రస్తుతం ప్రియాంక.. హాలీవుడ్‌లోనే రొమాంటిక్ కామెడీ చిత్రం ‘లవ్ ఎగైన్’లో నటిస్తోంది.
Image: Instagram/priyankachopra