బాలీవుడ్‌ ఫ్యూచర్‌ సూపర్‌ స్టార్‌ అలాయనేనట!

భవిష్యత్తులో నటి అలాయ ఎఫ్‌ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అవుతుందని ఓ ఇంటర్వ్యూలో గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా చెప్పింది. ఇంతకీ ఈ అలాయ ఎఫ్‌. ఎవరో తెలుసా? 

Image: Instagram/Alaya F

అలాయ పూర్తి పేరు అలాయ ఫర్నిచర్‌వాలా. 1997, నవంబర్‌ 28న ముంబయిలో జన్మించింది. ప్రముఖ బాలీవుడ్‌ నటి పూజా బేడీ కుమార్తె.. కబీర్‌ బేడీ మనవరాలు. 

Image: Instagram/Alaya F

పాఠశాల విద్య పూర్తవగానే నటనపై ఆసక్తితో న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో చేరింది. కాంటెంపరరీ, కథక్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది.

Image: Instagram/Alaya F 

This browser does not support the video element.

కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. 2020లో ‘జవానీ జానెమన్‌’తో తెరంగేట్రం చేసింది అలాయ.

Image: Instagram/Alaya F

ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినా అలాయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. గొప్ప నటి అవుతుందని విమర్శకులు సైతం ప్రశంసించారు.

Image: Instagram/Alaya F

‘జవానీ జానెమన్‌’కి గానూ ఉత్తమ పరిచయ నాయికగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా అందుకుంది అలాయ.

Image: Instagram/Alaya F

ఆ తర్వాత ‘ఫ్రెడ్డీ’, ‘అల్మోస్ట్‌ ప్యార్‌ విత్‌ డీజీ మొహబ్బత్‌’లో నటించి మెప్పించింది. 

Image: Instagram/Alaya F

ప్రస్తుతం ‘ఏక్‌ ఔర్‌ గజీబ్‌ కహానీ’, ‘యూటర్న్‌’లో నటిస్తూ బిజీగా ఉంది. 

Image: Instagram/Alaya F

దివ్యాంగ పారిశ్రామిక వేత్త శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలోనూ అలాయ నటిస్తోంది. 

Image: Instagram/Alaya F

ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపే అలాయ.. క్రమం తప్పకుండా యోగా చేస్తుందట. యోగా చేస్తే ఉత్సాహంగా ఉంటుందని, మన శరీరానికి ఏం కావాలో అది యోగా ఇస్తుందని చెబుతోంది.

Image: Instagram/Alaya F

అలాయ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమెకు 1.4 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. 

Image: Instagram/Alaya F

మలయాళంలో టాప్‌ 10 సినిమాలు ఇవే!

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

మీర్జాపూర్‌ గర్ల్‌.. హర్షితా గౌర్‌

Eenadu.net Home