#eenadu

చాలా మందికి రోజు మొదలయ్యేది టీ తోనే. వర్షాకాలం ఐతే మరీ ఎక్కువగా తీసుకుంటారు. పదే పదే టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు నిపుణులు.. అవేంటో చూసేయండి. 

టీ ఎక్కువగా తాగేవారిలో రొమ్ము, కాలేయ క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీలో ఉండే టానిన్స్‌ ఐరన్‌ని గ్రహించనీయవు. దీంతో ఐరన్‌ లోపం వస్తుంది.

టీ, కాఫీల్లో ఉండే కెఫీన్‌ గుండెల్లో మంట, ఎసిడిటీకి కారణమవుతుంది. జీర్ణవ్యవస్థలో ఆమ్లం ఉత్పత్తిని పెంచుతుంది. ఆ ప్రభావం జీర్ణక్రియపై పడుతుంది. ఖాళీ కడుపుతో టీ అస్సలు తాగకూడదు.

కొందరు తలనొప్పి వస్తే టీ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ అధిక మోతాదులో తాగితే టీలో ఉండే కెఫీన్‌ వల్ల తలనొప్పితో పాటు వికారం కూడా మొదలవుతుంది.

మెలటోనిన్‌ అనే హార్మోన్‌ మెదడుకు విశ్రాంతినిస్తుంది. కెఫీన్‌ మెలటోనిన్‌ చర్యను అడ్డుకుంటుంది. దీని కారణంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. 

గర్భిణిగా ఉన్నా కొందరు అధికంగా టీ తాగుతారు. దీని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆకలి వేయదు. సమయానికి నిద్ర పట్టదు. దీంతో పిల్లలు తక్కువ బరువుతో పుడతారు.

 టీని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్‌కు గురవుతుంది. మలబద్ధకం వస్తుంది. టీ స్థానంలో మంచి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవడం ఉత్తమం.

ఎక్కువ సార్లు టీ తాగే వారిలో భావోద్వేగాలు అదుపులో ఉండవు. వీటి స్థానంలో తగిన మోతాదులో హెర్బల్‌ టీలను తీసుకోవడం మంచిది. 

టీలో ఉండే కెఫిన్‌ గుండె వేగాన్ని పెంచుతుంది. దీంట్లో వాడే చక్కెర వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరుగుతాయి. డయాబెటిస్‌తో పాటు ఊబకాయం వచ్చే అవకాశాలున్నాయి.

టీ అధికంగా తాగడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీని వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, చర్మ సమస్యలు, ముఖం మీద మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి.  

రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ పానీయాలు ట్రై చేయండి

విరాట్‌ అనుసరిస్తున్న హిట్‌ ఎక్సర్‌సైజ్‌..

ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తున్నారా?

Eenadu.net Home