వివాహ బంధంలో విభేదాలకు కారణాలివేనట!
హేళన వద్దు..
భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ చదువుకొని ఉండవచ్చు. ఎక్కువ డబ్బు సంపాదించేవారు కావచ్చు. మరొకరు అలా ఉండకపోవచ్చు. ఈ కారణంతో భాగస్వామిని హేళన చేయడం సరికాదు. ఇలా చేస్తే వాళ్లు మానసికంగా కుంగిపోతారు. ఇద్దరి మధ్య దూరం పెరిగి.. గొడవలొస్తాయి.
Image: RKC
ఆర్థికపరమైన..
ఒకరు ఆదా చేస్తూ, మరొకరు ఖర్చు చేస్తే గొడవలు వస్తుంటాయి. అందుకే ఇద్దరూ కూర్చుని ఏయే అవసరానికి ఎంత ఖర్చు ఉంటుందో లెక్క వేసుకోవాలి. కొంత డబ్బు ఆదా చేసుకోవాలి.
Image: RKC
పిల్లల పెంపకం!
పిల్లల్ని పెంచడం అంత సులభం కాదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు తల్లి మాత్రమే పిల్లల్ని చూసుకోవాలంటే కష్టం. ఈ విషయంలో తరచూ గొడవలు పడుతుంటారు. కాబట్టి పిల్లల బాధ్యతను ఇద్దరూ తీసుకోవాలి.
Image: RKC
శరీరాకృతి..
చాలామంది మహిళలు ప్రసవం తర్వాత బరువు పెరుగుతుంటారు. పురుషులూ తగిన శారీరక శ్రమ లేక బరువు పెరిగి ఇబ్బంది పడుతుంటారు. దీంతో అందం విషయంలో భాగస్వామితో సమస్యలు ఎదురవుతుంటాయి. అందానికి రంగు, రూపు, శరీరాకృతి కొలమానాలు కావని గుర్తుంచుకుంటే ఈ సమస్య తలెత్తదు.
Image: RKC
మాట్లాడే పద్ధతి..
చాలామంది జంటల్లో మాట్లాడే విధానం గురించి కూడా గొడవలు వస్తుంటాయి. దురుసుగా మాట్లాడటం, అస్సలూ మాట్లాడకపోవడం, ఎత్తిపొడుపు మాటలతో నొప్పించడం వంటివి కారణాలుగా చెప్పొచ్చు. మాట్లాడే పద్ధతిని మార్చుకోమని సున్నితంగా చెబితే సరిపోతుంది.
Image: RKC
ప్రేమ భాషలు వేరు వేరు...
ఒక్కొక్కరు ఒక్కోలా తమ ప్రేమను తెలియజేస్తారు. కొంతమంది పనిలో సాయం చేస్తే, మరికొందరు అడిగిందల్లా తెచ్చిస్తారు. దాన్ని ప్రేమగానే చూడాలి కానీ.. అలుసుగా తీసుకోకూడదు. వారితో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే.. గొడవలు కావొచ్చు.
Image: RKC
శృంగారం
శృంగారం భార్యాభర్తల మధ్య బంధాన్ని బలపడేలా చేస్తుంది. పడక గదిలో వారి ఇష్టాయిష్టాలను తెలుసుకొని మెలగాలి. ఇద్దరిలో ఏ ఒక్కరూ అసంతృప్తికి గురైనా గొడవలు మొదలవుతాయి.
Image: RKC
అసూయ, అనుమానం..
కొంతమంది భాగస్వామి మీద అసూయ, అనుమానంతో ఉంటారట! భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు నిజాయతీగా, నమ్మకంతో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతికూల భావాలు దరిచేరవు. నమ్మకమే దాంపత్య జీవితాన్ని కాపాడుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
Image: RKC
కుటుంబం ముఖ్యం
మొదట్లో ఉన్న ప్రేమానురాగాలు పోను పోను భార్యాభర్తల్లో తగ్గిపోతుంటాయి. పని ఒత్తిడి, పిల్లలు, బాధ్యతల్లో మునిగిపోతారు. దీని వల్ల కూడా గొడవలు వచ్చే అవకాశాలున్నాయి. అందుకే, ఎంత పని ఉన్నా రోజులో కాస్త కుటుంబంతో గడిపే ప్రయత్నం చేయాలి.
Image: RKC
గౌరవం ఇవ్వాలి..
అభిప్రాయ భేదాల వల్లే చాలా మంది భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్తున్నారు! ఒక్కొక్కరికీ భిన్నమైన నమ్మకాలు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని ఎదుటివారు గౌరవించినప్పుడు సమస్యలుండవు.
Image: RKC