మిస్ కోయంబత్తూరు నుంచి వీజే వరకూ
అతిథి పాత్రలతో తనదైన రీతిలో ఆకట్టుకుంటోన్న పూజరామచంద్రన్ ‘హత్య’తో తాజాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
శ్రీవిద్య బసవ దర్శకత్వం వహించిన ‘హత్య’ జనవరి 24న విడుదల కానుంది. ఇందులో పూజ కీలక పాత్ర పోషించింది.
పూజ బెంగళూరులో పుట్టింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్. చదువంతా కోయంబత్తూరులో సాగింది. విజువల్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
మిస్ కోయంబత్తూరుగా గెలిచిన ఈమెకు మోడలింగ్‌పై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత 2011లో ‘7th సెన్స్’ ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.
సిద్ధార్థ్ ‘లవ్ ఫెయిల్యూర్’లో అతిథి పాత్రలో తెలుగు తెరపై అడుగుపెట్టింది. ‘స్వామిరారా’, ‘అడవి కాచిన వెన్నెల’, ‘కాంచన 2’, ‘దోచెయ్’, ‘త్రిపుర’, ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి తెలుగు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్‌తో అలరించింది.
సినిమాల్లోనే కాకుండా వెబ్‌సిరీస్‌లోనూ నటించింది పూజ. ‘ద విలేజ్’ అనే వెబ్‌సిరీస్‌తో 2023లో ఓటీటీలో అడుగుపెట్టింది.
2010 నుంచి 2017 వరకూ వీడియో జాకీగా పని చేసింది. ఆ క్రమంలోనే 2010లో వీజేగా పనిచేస్తున్న క్రైగ్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు.
2019లో నటుడు జాన్ కొక్కెన్‌ను వివాహమాడింది పూజ. వీరిద్దరికీ ఓ బాబు.
బ్యాడ్మింటన్ అంటే ఆసక్తి. గ్రౌండ్‌లో దిగితే గంటల కొద్దీ ఆడుతూనే ఉంటుంది.
ఫిట్‌గా ఉండేందుకు యోగా చేస్తుంది. కఠినమైన ఆసనాలతో రోజుని ప్రారంభిస్తే డే మొత్తం ఉత్సాహంగా ఉంటుందని చెప్పింది.
కుటుంబంతో కలిసి తరచుగా విహారయాత్రలకు వెళుతుంది. ఆ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.