పూజిత.. తెలుగమ్మాయి.. అదిరిందోయ్‌

నాగార్జున, కార్తీ కలిసి నటించిన ‘ఊపిరి’తో వెండితెరపై తొలిసారి మెరిసిన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా మారింది.

Image:Instagram/Pujita Ponnada

ఆమె నటించిన ‘ఆకాశ వీధుల్లో’ సెప్టెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్‌ కృష్ణ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా గౌతమే కావడం విశేషం.

Image:Instagram/Pujita Ponnada

ఇటీవల విడుదలైన ‘ఓదేలు రైల్వే స్టేషన్‌’లోనూ  స్ఫూర్తిగా కనిపించింది పూజిత.

Image:Instagram/Pujita Ponnada

1989 అక్టోబర్‌ 5న విశాఖపట్నంలో జన్మించిన పూజిత.. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎమ్‌ ఈశ్వరి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసింది.

Image:Instagram/Pujita Ponnada

 అనంతరం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేసింది.

Image:Instagram/Pujita Ponnada

‘ఉప్మా తినేసింది’ (2015), ‘ఏ సటర్‌ డే ఈవినింగ్’ (2016) వంటి షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించింది.

Image:Instagram/Pujita Ponnada

‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌ సోదరుడి ప్రేయసి పాత్రలో తళుక్కుమంది.

Image:Instagram/Pujita Ponnada

‘రాజుగాడు’, ‘బ్రాండ్ బాబు’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘కల్కి’, ‘రన్‌’, ‘మిస్‌ ఇండియా’ వంటి సినిమాల్లో నటించింది.

Image:Instagram/Pujita Ponnada

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’లో పూజిత పొన్నాడ ప్రత్యేక గీతంలో కనిపించనుంది.

Image:Instagram/Pujita Ponnada

ట్రావెలింగ్‌, షాపింగ్‌ చేయడం ఈ బ్యూటీ హాబీస్‌.

Image:Instagram/Pujita Ponnada

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలున్నాయి. ‘రావణసుర’, ‘భగవాన్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

Image:Instagram/Pujita Ponnada

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home