పునర్నవి సినీ కెరీర్ ‘ఉయ్యాలా జంపాలా’
‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో సునీత పాత్రలో తొలిసారి తెరపై కనిపించింది పునర్నవి భూపాలం.
Source : Punarnavi Bhupalam
మొదటి చిత్రంలోనే ఆమె నటనకు ‘ఉత్తమ సహాయ నటి’గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది.
Source : Punarnavi Bhupalam
ఇక ‘బిగ్‌బాస్ 3’లో కంటెస్టెంట్‌గా వెళ్లి వచ్చిన తరువాత రెండు టెలివిజన్ షోల్లో మాత్రమే కనిపించింది.
Source : Punarnavi Bhupalam
2020లో వచ్చిన సైకిల్ సినిమా, కమిట్‌మెంటల్ వెబ్‌సిరీస్ తర్వాత ఆమె తెరపై కనిపించలేదు.
Source : Punarnavi Bhupalam
పునర్నవి 1996 మే 28న తెనాలిలో పుట్టింది. విజయవాడలో పాఠశాల విద్య పూర్తి చేసింది. హైదరాబాద్‌లో సైకాలజీ, జర్నలిజం చదివి.. ఆయా విభాగాల్లో పట్టా పొందింది.
Source : Punarnavi Bhupalam
తొలి చిత్రం ‘ఉయ్యాలా.. జంపాలా’ తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారంటీ’, ‘పిట్టగోడ’, ‘మనసుకు నచ్చింది’, ‘ఎందుకో ఏమో’ వంటి చిత్రాల్లో నటించింది.
Source : Punarnavi Bhupalam
నటిగా మెప్పించినా.. పునర్నవికి మంచి అవకాశాలు రాలేదనే చెప్పొచ్చు.
Source : Punarnavi Bhupalam
పునర్నవికి సినిమాల కంటే ముందే లలిత కళలపై ఆసక్తి ఉండేది. దాంతో థియేటర్ ఆర్ట్స్‌లో చేరింది.
Source : Punarnavi Bhupalam
నటిగా తనను తాను నిరూపించుకోవడానికి సినిమా మాధ్యమం కంటే.. థియేటర్ ఆర్ట్స్ ఎక్కువ ఉపయోగపడిందని ఓ సందర్భంలో వివరించింది.
Source : Punarnavi Bhupalam
థియేటర్ ఆర్ట్స్‌పై మక్కువతోనే ప్రస్తుతం లండన్‌లో డ్రామా అండ్ మూవ్మెంట్ థెరపీలో మాస్టర్స్ చదువుతోంది.
Source : Punarnavi Bhupalam
అక్కడి విషయాలను, తన పర్యటనల గురించి తరచూ ఇన్‌స్టాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాలో 5 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.
Source : Punarnavi Bhupalam
పునర్నవి ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. తాను చేసే యోగాసనాల ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
Source : Punarnavi Bhupalam
పండగలంటే పునర్నవికి ఎంతో ఇష్టం. ఆ రోజు ప్రత్యేకంగా ముస్తాబై.. విశేషాలను తప్పకుండా పోస్టు చేస్తుంది.
Source : Punarnavi Bhupalam
ఇటీవల తాను ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు తెలిపింది.
Source : Punarnavi Bhupalam