స్టెప్పులతో అదరగొడుతున్న శ్రష్టి వర్మ..

‘పుష్ప 2’ నుంచి తాజాగా విడుదలైన ‘పుష్ప.. పుష్ప..’ పాట బాగా వైరలవుతోంది. దీనికి విజయ్‌ పోలాకితో పాటు శ్రష్టి వర్మ కూడా కొరియోగ్రఫీ చేసింది. 

ఈ పాటలో అల్లు అర్జున్‌ వేసిన ‘ఫోన్‌ స్టెప్పు, షూ డ్రాప్‌ స్టెప్పు’ బాగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైంది లిరిక్‌ సాంగే అయినా.. క్రేజ్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది.

శ్రష్టి.. ‘ఢీ 11’లో కంటెంస్టెంట్‌గా పాల్గొంది. ఎన్నో సినిమా పాటలకు జానీ మాస్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆ తర్వాత నేరుగా తనే కంపోజ్‌ చేయడం మొదలు పెట్టింది.

This browser does not support the video element.

‘మనమే’లో శర్వానంద్‌కి స్టెప్పులు కంపోజ్‌ చేస్తూ శ్రష్టి సెట్స్‌లో తీసుకున్న వీడియో వైరల్‌ అయ్యింది.

శ్రీనివాస్‌ విట్టల దర్శకత్వంలో రానున్న ‘యథా రాజా తథా ప్రజా’లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది ఈ డ్యాన్సర్‌. ఇందులో జానీ మాస్టర్‌ హీరో.

డ్యాన్స్‌ మీద ఆసక్తితో చిన్నతనం నుంచే కథక్‌లో శిక్షణ తీసుకుంది. ‘కథక్‌ ఫెస్ట్‌’లో ‘నృత్య యువమణి’ అనే అవార్డును కూడా గెలుచుకుంది.

టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లకు అసిస్టెంట్‌గా వ్యవహరిస్తూ పేరు సంపాదించుకుంటుంది. 

This browser does not support the video element.

ఈమెకి ట్రావెలింగ్‌ అంటే మహా ఇష్టం. అందులోనూ బీచ్‌లో ఆడుకోవడం బాగా నచ్చుతుంది.

ప్రభుదేవా, ధనుష్‌, రామ్ చరణ్‌, సల్మాన్‌ ఖాన్, సూర్య, రామ్‌ ఇలా ప్రముఖులతో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

ధూం ధామ్‌గా హెబ్బా పటేల్‌!

ఒక్క అక్షరమే టైటిల్‌.. ఆ చిత్రాలివే!

నవంబర్‌లో విడుదల కానున్న చిత్రాల్లో అలరించనుంది వీరే!

Eenadu.net Home