దటీజ్ సింధు.. ఈసారి స్వర్ణం తెచ్చింది!
తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్‌లో అదరగొట్టింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచింది.
Image: AP
ఫైనల్స్‌లో కెనడా షట్లర్ మిచెలీ లీని 21-15, 21-13 పాయింట్లతో ఓడించి విజేతగా నిలిచింది.
Image: AP
ఈ వేదికపైనే బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీం విభాగంలో రజత పతకం నెగ్గింది.
Image: Instagram/PV Sindhu
గత కామన్వెల్త్ గేమ్స్‌లోనూ భారత్‌కు పతకాలు అందించింది సింధు.
Image: Instagram/PV Sindhu
2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌లో మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించింది.
Image: Instagram/PV Sindhu
గోల్డ్‌కోస్ట్ వేదికగా 2018లో నిర్వహించిన కామన్వెల్త్ పోటీల్లో మహిళల సింగిల్స్‌లో రజతం గెలిచింది. అలాగే, మిక్స్‌డ్ టీంలో స్వర్ణ పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
Image: Instagram/PV Sindhu
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధు.. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
Image: Instagram/PV Sindhu
2018 ఆసియా గేమ్స్‌లో రజత పతకం సాధించింది సింధు.
Image: Instagram/PV Sindhu
జులైలో జరిగిన సింగపూర్ ఓపెన్‌లో గెలుపొంది తొలి సూపర్ 500 టైటిల్ నెగ్గింది.
Image: Instagram/PV Sindhu
ఈ ఏడాదిలోనే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిళ్లను సొంతం చేసుకొని విజయయాత్ర కొనసాగిస్తోంది.
Image: Instagram/PV Sindhu