మంచి స్నేహితుడు ఎలా ఉండాలంటే...!

ఎవరితోనూ పంచుకోలేని విషయాలను కూడా స్నేహితులతో నిస్సందేహంగా చెప్పుకుంటాం. అలాంటి స్నేహితుల్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మరి మంచి స్నేహితులకు ఎలాంటి లక్షణాలు ఉండాలంటే..

image:RKC

నమ్మకం కలిగించాలి. అన్నింటా తోడుగా ఉంటాననే భరోసా లభించేలా వారి మాటతీరు ఉండాలి.

image:RKC

ఏ అవసరం వచ్చినా సాయ పడాలి. చదువు, వ్యాపారం విషయంలో అండగా ఉంటానని చెప్పగలగాలి.

image:RKC

మనల్ని అర్థం చేసుకోవాలి. మన అభిప్రాయాలను, సూచనలను గౌరవించాలి. అపార్థం చేసుకునేలా ఉండొద్దు.

image:RKC

తప్పు చేసినా, సమస్యల్లోనూ నిందించవద్దు.. వాటి నుంచి బయట పడే మార్గం చూసేవాడే స్నేహితుడు.

image:RKC

పొరపాటు చేసినా, నిర్ణయాలు సరిగా తీసుకోకపోయినా మార్గనిర్దేశం చేసేవాడు కావాలి. కానీ వాటిని పదే పదే ఎత్తి చూపేవాడు కాదు.

image:RKC

నీతి, నిజాయతీ ఉంటే వారిని నమ్మడానికి వీలవుతుంది. అలాంటి స్నేహితులే హితం కోరి మంచి మాటలు చెబుతారు.

image:RKC

ఇతరుల ముందు పరువు తీసేలా ఉండొద్దు. అవమానించేలా మాట్లాడే వారిని దూరం పెట్టాలి. లేకపోతే నష్టం వాటిల్లుతుంది.

image:RKC

ఇంట్లో జరిగే శుభ కార్యాలు, ఇతర కార్యక్రమాల్లో తోడుగా ఉండాలి. సరదాగా ఉంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.

image:RKC

కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండటం, మన ఎదుగుదలకు సాయపడే మిత్రుడితో ఇబ్బందులుండవు. లేకపోతే కుటుంబంలో కలతలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

image:RKC

ఆర్థికంగా ఆదుకోకపోయినా ఫరవాలేదు. కానీ డబ్బులు తీసుకుని ముంచేస్తే కోలుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారిని దరి చేరనీయొద్దు.

image:RKC

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home