రాచెల్.. ఆ ఘనత దక్కించుకున్న

మూడో మహిళ

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన 20 ఏళ్ల రాచెల్ గుప్తా ‘2024 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ విజేతగా నిలిచింది.

టాప్ మోడల్‌, బెస్ట్‌ ర్యాంప్‌ వాక్‌, బ్యూటీ విత్‌ పర్పస్, బెస్ట్‌ నేషనల్‌ కాస్ట్యూమ్‌ వంటి సబ్‌ టైటిళ్లనూ ఆమె సొంతం చేసుకుంది.

2004 లో జలంధర్‌లో జన్మించిన రాచెల్‌ గుప్తా.. 18ఏళ్ల నుంచే మోడలింగ్‌ చేయడం ప్రారంభించింది. 

మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరిటాన్ని గెలిచిన మూడో భారతీయ మహిళ రాచెల్‌ గుప్తా .

పారిస్‌లో జరిగిన 15వ ఎడిషన్ పోటీలో ‘మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్’గానూ నిలిచిందీ బ్యూటీ.

మోడలింగ్‌తోనే కాదు, వ్యాపారంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.‘ది గ్లామ్‌ బార్‌’ద్వారా మోడలింగ్‌లో శిక్షణ అందిస్తోంది.

సమాజం నుంచి తీసుకోవడమే కాదు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనుకునే రాచెల్‌ బ్యాంకాక్‌లో స్లమ్‌ చైల్డ్‌ ఫౌండేషన్‌కు అవసరమైన వస్తువులను విరాళంగా అందిస్తోంది.

‘కిరీటాన్ని గెలవడంతోనే నా ప్రయాణం మొదలైంది’అంటోంది రాచెల్‌. పోరాడుకోవడం మానేసి ఒకరికొరు గౌరవించుకోవాలని ప్రపంచ నాయకులకు సందేశాన్ని ఇచ్చింది.

చలికాలంలో హిల్‌స్టేషన్ల సోయగాలు చూస్తారా?

భావోద్వేగ నియంత్రణకు ఆహారం!

సన్‌సెట్‌.. కప్‌కేక్స్‌.. ఇవే మిస్‌ టీన్‌ ఫేవరెట్స్‌

Eenadu.net Home