బోర్ కొట్టింది.. బ్రేక్ ఇచ్చా..
అక్షయ్ కుమార్ సరసన ‘సర్‌ఫిరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలీవుడ్ బ్యూటీ రాధికా మదన్..
ఈ చిత్రం జులై 12న విడుదలైంది. సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఇందులో రాధిక ‘రాణి’ పాత్రలో కనిపించారు.
బాలీవుడ్‌లో ‘సనా’, ‘రుమీ కీ షరాఫత్’ వంటి చిత్రాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది.
గతేడాది ‘కచ్చే లింబు’, ‘సజిని షిండే కా వైరల్ వీడియో’ వంటి పలు చిత్రాలే కాకుండా ‘సాస్, బహు ఔర్ ఫ్లెమింగో’ వెబ్ సిరీస్‌తోనూ అలరించింది.
This browser does not support the video element.
‘.. ఔర్ ఫ్లెమింగో’ సిరీస్‌కు గానూ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఏ ఒరిజినల్ ఫిల్మ్’ అవార్డును గెలుచుకుంది.
‘గతేడాది వరుసగా సినిమాలు, సిరీస్‌ల షూటింగ్ వల్ల కొంచెం కూడా బ్రేక్ లేదు. దాంతో విసుగొచ్చి కొద్ది కాలం బ్రేక్ తీసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని ప్రాజెక్టులకు నో చెప్పాను’ అని ఓ సందర్భంలో చెప్పింది.
రాధికా మదన్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లు పూర్తయ్యింది. 2014లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అదే జోరుతో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.
This browser does not support the video element.
కిందటి ఏడాది ఫోర్బ్స్ ఇండియాలో అండర్- 30 జాబితాలో రష్మిక మందన్నాతో పాటు రాధికా మదన్‌కూ చోటు దక్కింది.
‘సేఫ్ జోన్‌లో ఉండి పని చేయాలనుకున్నంత కాలం.. మనం ఏదీ సాధించలేం. అందుకే నేను హార్డ్‌వర్క్ చేసేందుకే ఇష్టపడతాను’ అంటోందీమె.
ప్రముఖ మ్యాగజీన్ కవర్ ఫొటోలకు పోజులిస్తుంటుంది రాధిక. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది.
ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. ఈమె ఇన్‌స్టా ఖాతాకి 41 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.