విజయ్‌ సాహిబా రాధికనే!

‘సర్ఫిరా’తో అలరించిన రాధికా మదన్‌ విజయ్‌ దేవరకొండ సరసన ఓ వీడియో సాంగ్‌లో కనిపించనుంది. ఈ సందర్భంగా రాధిక గురించి ఆసక్తికర విషయాలు.

‘సాహెబా..’ పాటకి సంబంధించి విజయ్‌, రాధికా ఒకరి ఇన్‌స్టా స్టోరీలో మరొకరు ‘మై సాహిబ్‌’, ‘మై సాహిబా’ అనే క్యాప్షన్‌తో ఫస్ట్‌లుక్‌ ఫొటోలను పంచుకున్నారు. 

ప్రస్తుతం రాధిక నటించిన ‘సుబేదార్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాలే కాకుండా వెబ్‌సిరీస్‌లతోనూ ఆకట్టుకుంటోంది.

‘సాస్‌, బహు ఔర్‌ ఫ్లెమింగో’ వెబ్‌ సిరీస్‌తో అలరించింది. ఈ సిరీస్‌కు గానూ ఐకానిక్‌ గోల్డ్‌ అవార్డ్స్‌ నుంచి ఉత్తమ నటిగా అవార్డునూ అందుకుంది. 

ఫోర్బ్స్‌ ఇండియా ‘30 అండర్‌ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న రాధిక.. ఈ ఏడాది బాలీవుడ్‌ హంగామా స్టైల్‌ ఐకాన్‌ నుంచి ‘మోస్ట్ స్టైలిష్‌ స్టైల్‌ ఇన్నొవేటర్‌’ టైటిల్‌నూ గెలుచుకుంది.

2018లో ‘పటాఖా’తో కెరీర్‌ మొదలుపెట్టిన రాధిక ఈ ఏడేళ్లలో నటించింది పది సినిమాలే అయినా.. బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

‘చీర కట్టుకుంటే నాకు నేనే మరింత అందంగా కనిపిస్తాను. ఎన్ని మోడ్రన్‌ డ్రెస్సులు వేసుకున్నా రాని సంతోషం శారీతో వస్తుంది’ అని అంటోంది.

ట్రెడిషనల్‌ లుక్‌తో పాటు రాధికకు ట్రెండ్‌ని సృష్టించడమూ తెలుసు. విభిన్న దుస్తుల ఫొటోషూట్లతో సందడి చేస్తుంటుంది.

స్నేహితులతో కలసి ట్రిప్పులకి వెళ్తుంది. ఆ అల్లరి వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది. ఇన్‌స్టా ఖాతాకి 41లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 

ఈమెకి నలుపు రంగంటే ఇష్టం. బ్లాక్‌ షేడ్‌ బ్యాగ్రౌండ్‌, నలుపు రంగు దుస్తుల్లో ఉన్న ఫొటోలే ఇన్‌స్టాలో ఎక్కువగా కనిపిస్తాయి.

సంప్రదాయ నృత్యం మీద ఇష్టంతో ఇటీవల కథక్‌ నేర్చుకోవడం మొదలు పెట్టింది. ఇది తనకెంతో సంతోషాన్నిస్తోందని అంటోంది.   

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home