రాహుల్‌ ‘దశావతారాలు’

రైల్వే కూలీగా.. 

దిల్లీలోని ఆనంద్‌విహార్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే కూలీలతో కలిసి బరువులు మోశారు.

 (Source: Rahul Whatsapp Channel)

రైల్వే ప్రయాణికుడు

బిలాస్‌పుర్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ వరకు 110 కి.మీ మేర సాధారణ ప్రయాణికులతో కలిసి రైల్లో ప్రయాణించారు.

(Source: Rahul Whatsapp Channel)

కార్పెంటర్‌

దిల్లీలోని కీర్తినగర్‌లో రాహుల్‌ వడ్రంగిలా చెక్కలు కోస్తూ కనిపించారు.

(Source: Rahul Whatsapp Channel)

ట్రక్కు డ్రైవర్‌

దిల్లీ నుంచి చండీగఢ్‌ మార్గంలో కొద్దిసేపు రాహుల్‌ ట్రక్కు నడిపారు.

(Source: Manikam Thakur Twitter)

వ్యవసాయదారుడు

హరియాణా పర్యటనలో ఉన్నప్పుడు రాహుల్ వరినాట్లు వేస్తూ కనిపించారు.

(Source: Congress Twitter)

బైక్‌పై..

రాజస్థాన్‌లోని జైపుర్‌లో కళాశాల విద్యార్థినులకు స్కూటీల పంపిణీ అనంతరం.. రాహుల్‌ విద్యార్థిని వెనుక ఇలా కూర్చొని ప్రయాణించారు.

 (Source: Rahul Whatsapp Channel)

కూరగాయల వ్యాపారి

టమాటా ధరల పెరుగుదలకు నిరసనగా దిల్లీలో కూరగాయల మార్కెట్‌ వ్యాపారులతో కలిసి రాహుల్‌ కూరగాయలు అమ్మారు. 

(Source: Telangana Youth Congress)

రన్నింగ్‌ రేసర్‌

భారత్‌ జోడో యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించిన రాహుల్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో కలిసి కొద్ది సేపు పరుగు తీశారు.

(Source: RRG)

విద్యార్థుల్లో విద్యార్థిగా..

లద్దాఖ్‌ పర్యటన సందర్భంగా రాహుల్‌ ఇలా విద్యార్థులతో సరదాగా కలిసిపోయి, కాసేపు ముచ్చటించారు.

(Source :rahul twitter)

బైక్‌ మెకానిక్‌..

దిల్లీలోని కరోల్‌బాగ్‌లో రాహుల్ బైక్‌మెకానిక్‌ అవతారమెత్తారు.

(Source: Congress Twitter)

ప్రేమతత్వం గురించి చెబుతున్న సద్గురు

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

Eenadu.net Home