చిరు జల్లుల వేళ ఈ పానీయాలు ట్రై చేయండి..!

 మసాలా టీ..

దాల్చిన చెక్క, యాలకులు వేసిన టీని వర్షం పడుతున్న సమయంలో తీసుకుంటే రిఫ్రెష్‌ అవ్వొచ్చు. ఇది గాలిలోని తేమతో వచ్చే గొంతు ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది.

image: ulsplash

గ్రీన్‌టీ..

గ్రీన్‌టీ ఆరోగ్యానికి మంచిది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఇలాంటి టీని వర్షం పడుతున్న సమయంలో తాగితే శరీరాన్ని మరింత తాజాగా, తేలికగా ఉంచుతుంది. 

image: ulsplash

 కోల్‌కతా మాక్‌టైల్‌..

కోల్‌కతా సిరప్‌తో పుదీనా, నిమ్మరసం, బ్లాక్‌ సాల్ట్‌ని కలిపి పానీయం చేసుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించి, హుషారును పెంచుతుంది.

image: ulsplash

పుదీనా గ్రీన్‌టీ...

పుదీనా, తేనె, నిమ్మరసంతో గ్రీన్‌ టీ చేసుకొని వర్షం పడుతున్న సమయంలో వేడివేడిగా తాగితే శరీరం వెచ్చగా.. హాయిగా ఉంటుంది. 

image: ulsplash

కేసరి దూద్‌..

ఈ పాలను వేడిగా, చల్లగా రెండు విధాలుగా సర్వ్‌ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు, డ్రైఫ్రూట్స్‌ని ఉపయోగించి ఈ పాలను వేడి చేసి తాగుతుంటారు. ఇది కశ్మీర్‌లో చాలా ఫేమస్‌..

image: ulsplash

తులసి కాఫీ..

సాయంత్రం వేళ వర్షాన్ని ఆస్వాదిస్తూ వేడివేడిగా తాగడానికి ఈ తులసి కాఫీ చాలా బాగుంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్ల్ఫమేటరీగానూ పని చేస్తుంది. 

image: ulsplash

లెమన్‌ జింజర్‌ టీ..

అల్లాన్ని వేడి నీళ్లలో మరిగించి అందులో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే చల్లని సాయంత్రం సమయంలో చాలా హాయిగా ఉంటుంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

image: ulsplash

నిమ్మ గడ్డితో టీ..

లెమన్‌ గ్రాస్‌తో చేసిన టీని తాగితే శరీరం, మనసు తేలికగా, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కొంచెం చేదుగా, తియ్యగా, పుల్లగా ఉండే ఈ టీ తాగితే ప్రశాంతంగా ఉంటుంది. చిరాకు, ఒత్తిడిని దరిచేరనీయదు. 

image: ulsplash

పసుపు పాలు..

గోల్డెన్‌ మిల్క్‌ వినే ఉంటారుగా. పాలల్లో ఓ చిటికెడు పసుపు పంచదార వేసుకొని వేడిచేసుకొని తాగొచ్చు. వాతావరణం మార్పుతో వచ్చే గొంతు నొప్పి, జలుబు నుంచి సంరక్షిస్తుంది. 

image: ulsplash

శొంఠి, మిరియాలు, పాలు..

ఓ గ్లాసు పాలల్లో కొద్దిగా శొంఠి పొడి, మిరియాల పొడి వేసుకొని కాచి తాగాలి. వేడిగా ఉన్నప్పుడు తాగితేనే రుచిని ఆస్వాదించొచ్చు. ఇది యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది.

image: ulsplash

రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ పానీయాలు ట్రై చేయండి

విరాట్‌ అనుసరిస్తున్న హిట్‌ ఎక్సర్‌సైజ్‌..

ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తున్నారా?

Eenadu.net Home