వాళ్ల సినిమాలు రిపీట్ మోడ్‌లో చూస్తా..
‘రామారావు ఆన్ డ్యూటీ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రజిషా విజయన్. ప్రస్తుతం ‘కీచురాళ్లు’తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.
2022లో విడుదలైన మలయాళ చిత్రం ‘కీడం’ను తెలుగులో డబ్ చేశారు. ఈ చిత్రం ప్రస్తుతం ఈటీవీ విన్ యాప్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
2016లో మలయాళంలో ‘అనురాగ కరిక్కిన్ వేల్లమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది రజిషా. వరుసగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది.
తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డు అందుకుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డుకూ నామినేట్ అయ్యింది. తన నటనతో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
ఈమె కేరళ(1991)లో పుట్టింది. నోయిడాలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. తల్లి టీచర్.
చదువు పూర్తికాగానే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. 2013లో బుల్లితెరపై మలయాళంలో టాక్ షోతో కెరీర్‌ను ప్రారంభించింది.
‘సినిమాల్లోకి రావడానికి యాంకరింగ్‌ను ఎంచుకోలేదు. నాకు అది ఇష్టం కాబట్టి చేశాను’ అని ఓ సందర్భంలో వెల్లడించింది.
‘చిన్నప్పుడు ఏ ఇంజినీరో, డాక్టరో అవుదామని కలలు కన్నాను. కానీ నటిని అయ్యాను. గో విత్ ద ఫ్లో అన్నట్టుగా జీవిస్తున్నాను’అంటోందీ బ్యూటీ.
ఖాళీ సమయం దొరికితే డ్యాన్స్ చేస్తుంది. సంప్రదాయ నృత్యంలోనూ ప్రావీణ్యం ఉంది. పుస్తకాలు ఎక్కువగా చదువుతుంది.
This browser does not support the video element.
స్పోర్ట్స్ ఎక్కువగా చూస్తుంది. థియేటర్‌లో సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. విహార యాత్రకైతే మనాలి వెళ్లాలంటోంది.
కమల్‌హాసన్, మోహన్ లాల్, అనుష్క శెట్టికి రజిషా వీరాభిమాని. సమయం దొరికితే.. వారి సినిమాలను రిపీట్ మోడ్‌లో చూస్తుందట.
సోషల్ మీడియాలో ఇటు సంప్రదాయంగానూ, అటు ట్రెండీగానూ ఆకట్టుకుంటోంది. తన ఇన్‌స్టా ఖాతాకి 2.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.