రకుల్‌ప్రీత్‌ ఫిజీ డైరీస్‌

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంది నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫిజీ ఐలాండ్స్‌లో పర్యటిస్తోంది.

టాలీవుడ్‌లో స్టార్‌హీరోయిన్‌గా వెలిగి.. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్థిరపడ్డ రకుల్‌ప్రీత్‌ ఇటీవల నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకీ అడుగుపెట్టింది. 

ఆ తర్వాత కూడా పలు సినిమాలతో ఇద్దరూ బిజీగా ఉండిపోయారు. వివాహమై 3 నెలలు పూర్తయిన సందర్భంగా వీరిద్దరూ విహారయాత్ర కోసం ఫిజీ వెళ్లారు. 

This browser does not support the video element.

అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేశారు. కోకోమో ప్రైవేట్‌ ఐలాండ్స్‌లో ట్రెక్కింగ్‌కి వెళ్లారు. 

This browser does not support the video element.

కొండలు, గుట్టలు ఎక్కుతూ తీసుకున్న వీడియోను రకుల్‌ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసింది. ‘నా బెస్ట్‌ ట్రావెల్‌ పార్ట్‌నర్‌ జాకీ భగ్నానీ’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. 

ట్రెక్కింగ్‌ అనంతరం ఓ జలపాతం వద్దకు చేరుకొని అందులో జలకాలాడారు. ట్రెక్కింగ్‌కు ఫలితం ఈ సుందర జలపాతమంటూ సంతోషం వ్యక్తం చేసింది. 

ఐలాండ్‌ మొత్తం చుట్టేస్తూ.. ఫిజీ వంటకాలు రుచి చూశారు. అక్కడి టూరిజాన్ని ప్రోత్సహించేందుకు తన పోస్టుల్లో #tourismfijiని జత చేసింది.  

ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌ శంకర్‌-కమల్‌హాసన్‌ కాంబోలో తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2’, ‘మేరీ పత్నీ కా రీమేక్‌’ చిత్రాల్లో నటిస్తోంది. 

Video/Images:Instagram/rakulpreet

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home