#Eenadu

ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా వార్తలకెక్కిన యూట్యూబర్‌ అల్హాబాదియాపై సర్వత్రావిమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఓ కంటెస్టెంట్‌ తల్లిదండ్రుల గురించి, శృంగారంపై ప్రశ్నించిన తీరు పట్ల వివిధ రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం, బెదిరింపులు వస్తుండటంతో రణ్‌వీర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అల్హాబాదియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. షోలో చేసిన వ్యాఖ్యలపై మండిపడింది.

‘‘వాక్‌ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక కట్టుబాట్లను గాలికొదిలేసి నోటికొచ్చింది మాట్లాడతారా?’’ - సుప్రీం కోర్టు

‘‘యూట్యూబ్‌ షోలో చేసిన వ్యాఖ్యలు.. అతడి మెదడులో పేరుకుపోయిన మలినాన్ని బయటపెట్టాయి. ఇవి అతడి వక్రబుద్ధిని సూచిస్తున్నాయి’’ - సుప్రీంకోర్టు

‘‘మీరు వాడిన పదాలు సమాజం సైతం సిగ్గుపడేలా చేస్తాయి. నువ్వు, నీ అనుచరులు ఆ స్థాయి దుర్మార్గానికి దిగజారారు’’ - సుప్రీంకోర్టు

‘‘భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛను హరించనంత వరకే. సామాజిక కట్టుబాట్లను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు’’ - దేవేంద్ర ఫడణవీస్‌, మహారాష్ట్ర సీఎం

‘‘సమాజం ఆమోదించని వ్యాఖ్యలు చేయడం భావప్రకటన స్వేచ్ఛ అనిపించుకోదు’ - బోనీ కపూర్‌, నిర్మాత

‘‘నేనే గనుక నిజమైన శక్తిమాన్‌ అయ్యుంటే.. అతడిని గెలాక్సీలోకి విసిరేసేవాడిని’ -ముకేశ్‌ ఖన్నా, సినీ నటుడు

చిత్రం చెప్పేవిశేషాలు(12-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(12-04-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(11-04-2025)

Eenadu.net Home