జయ్‌దేవ్‌ ఉనద్కత్‌.. అరుదైన రికార్డు!

భారత క్రికెటర్‌ జయ్‌దేవ్‌ ఉనద్కత్‌ ఓ అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసి.. 12 ఏళ్ల తర్వాత రెండో టెస్టు ఆడాడు. సూదీర్ఘకాలం టెస్టుకు దూరమైన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

Image: Twitter

అంతేకాదు.. సుదీర్ఘ కెరీర్‌లో తొలి టెస్టు వికెట్‌ పడగొట్టాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్నటెస్ట్‌ మ్యాచ్‌లో ఉనద్కత్‌ జాకీర్‌ హసన్‌ వికెట్‌ తీశాడు.

Image: Twitter

ఉనద్కత్‌ పూర్తి పేరు.. జయ్‌దేవ్‌ దీపక్‌భాయ్‌ ఉనద్కత్‌. గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో 1991 అక్టోబర్‌ 18న జన్మించాడు.

Image: Twitter 

చిన్నతనం నుంచే క్రికెట్‌లో శిక్షణ తీసుకున్న జయ్‌దేవ్‌.. దేశీయ క్రికెట్‌లో రాణించి.. 2010లో అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడాడు. 

Image: Twitter

ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 13 వికెట్లు తీసి ఉత్తమ ప్రదర్శన కనబర్చాడు. దీంతో ఉనద్కత్‌కు జాతీయ జట్టులో చోటు దక్కింది. 2010లో దక్షిణాఫ్రికాతో టెస్టులో అరంగేట్రం చేశాడు.

Image: Twitter

పుష్కర కాలం తర్వాత మళ్లీ ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌కు టెస్టు మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కింది. బంగ్లాతో రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌ స్థానంలో ఉనద్కత్‌ బరిలో దిగాడు.

Image: Twitter

టెస్టులు కాకుండా.. 7 అంతర్జాతీయ వన్డేలు, 10 టీ20ల్లో ఆడాడు ఉనద్కత్‌. రంజీల్లో ఎక్కువగా సౌరాష్ట్ర తరఫున ఆడుతుంటాడు. 2019లో ఆ జట్టు తరఫున రంజీ ట్రోఫీలో 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. 

Image: Twitter

భారత టీ20 లీగ్‌లో పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2013లో ఉనద్కత్‌ ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. బేస్‌ ప్రైస్‌ ₹కోటి ఉండగా.. బెంగళూరు ఇతడిని ₹2.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

Image: Twitter

ఆ తర్వాత 2018లో అత్యధికంగా రూ. 11.50కోట్లు పెట్టి ఉన్కదత్‌ను దక్కించుకుంది రాజస్థాన్‌ జట్టు. 2019లో అదే జట్టు ఇతడి కోసం రూ. 8.40కోట్లు వెచ్చించింది. ఇక 2022లో ముంబయి రూ.1.03కోట్లకే జట్టులోకి తీసుకుంది.

Image: Twitter

టీ20 లీగ్‌ కెరీర్‌లో ఉనద్కత్‌ ఉత్తమ ప్రదర్శన 5/25. 2013లోనే దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఈ బౌలర్‌ 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

Image: Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home