SRH X RCB విశేషాలెన్నో..!

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మే 18న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం..

Image: Twitter

ఒకే మ్యాచ్‌లో హైదరాబాద్‌ తరఫున హెన్రిచ్‌ క్లాసెన్‌(104), బెంగళూరు తరఫున విరాట్‌ కోహ్లీ(100) శతకాలు చేశారు.

Image: Twitter

ఇది వరకు ఐపీఎల్‌ -2019లో హైదరాబాద్‌ జట్టు ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో బెంగళూరుపై చెరో సెంచరీ నమోదు చేశారు.  

Image: Twitter

ఇక 2016లో గుజరాత్‌ లయన్స్‌పై బెంగళూరు బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ శతకాలు సాధించారు. 

Image: Twitter

తాజా మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‌ కలిసి 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. 

Image: Twitter

ఇది వరకు ఐపీఎల్‌ - 2021లో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తరఫున దేవదత్‌ పడిక్కల్‌తో కలిసి కోహ్లీ చేసిన 181* పరుగుల భాగస్వామ్యమే అత్యధికం.

Image: Twitter

తాజా శతకంతో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు(6) చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. గతంలో క్రిస్‌గేల్‌ కూడా 6 సెంచరీలతో టాప్‌ 1లో ఉన్నాడు.

Image: Twitter

ఉప్పల్‌ స్టేడియంలో బెంగళూరు, హైదరాబాద్‌ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తలపడగా.. బెంగళూరుకు ఇది కేవలం రెండో విజయం. తొలిసారి 2015లో గెలిచింది.

Image: Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home