బర్త్‌డే.. వన్డేల్లో తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ఘనత

అఫ్గాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ అరుదైన ఘనత సాధించాడు. 

దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అతడు.. తన జట్టు సఫారీలపై 177 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. శుక్రవారం (సెప్టెంబర్ 20) జరిగిన ఈ మ్యాచ్‌ రషీద్‌కు స్పెషల్. అతడి బర్త్‌డే. 

పుట్టిన రోజున వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్‌గా అవతరించాడు. అతడి తర్వాత అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు ఎవరివంటే?

రషీద్ ఖాన్‌

దేశం: అఫ్గానిస్థాన్‌

బౌలింగ్‌: 5/19

ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా, 2024

వెర్నాన్ ఫిలాండర్

దేశం: దక్షిణాఫ్రికా

బౌలింగ్‌: 4/12

ప్రత్యర్థి: ఐర్లాండ్, 2007

స్టువర్ట్ బ్రాడ్

దేశం: ఇంగ్లండ్

బౌలింగ్‌: 4/44

ప్రత్యర్థి: ఆస్ట్రేలియా, 2010

రెజ్లర్‌ టు ఎమ్మెల్యే.. వినేశ్‌ ఓ వారియర్‌!

టెస్టు చరిత్రలో టాప్‌ 10 భారీ ఇన్నింగ్స్‌లు

టెస్టుల్లో 50+ స్కోర్లు.. టాప్‌ 5 ప్లేయర్లు!

Eenadu.net Home