హ్యాట్రిక్‌ కొట్టిన శ్రీవల్లి.. క్రేజీ చిత్రాలతో బిజీ..

#RashmikaMandanna

రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి రష్మిక నటించిన ‘యానిమల్‌’ రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది.

శ్రీవల్లిగా పుష్పరాజ్‌తో కలిసి పీలింగ్స్‌ పంచడమే కాదు, నటనతో మెస్మరైజ్‌ చేసి, రూ.1800 కోట్లు వసూలు చేసిన మూవీలో భాగమైంది.

‘శ్రీసఖి’అంటూ శంభాజీ మహారాజ్‌ ప్రేమగా పిలిచే ప్రియసఖి అయింది. ‘ఛావా’తో బాక్సాఫీస్‌ కొల్లగొడుతోంది.

వరుస విజయాలతో క్రేజ్‌ సొంతం చేసుకున్న రష్మిక ఒక్కో మూవీకి రూ.4కోట్లు పారితోషికం తీసుకుంటోందట.

ప్రస్తుతం రష్మిక చేతిలో హిందీతో పాటు, తెలుగు, తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి.

సల్మాన్‌ఖాన్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో ‘సికిందర్‌’లో నటిస్తోంది.

కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చేస్తోంది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు.

శేఖర్‌ కమ్ముల మూవీ ‘కుబేర’లోనూ నటిస్తోంది. ధనుష్‌, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి వైవిధ్య చిత్రం ‘థామా’లోనూ తనదైన నటనతో అలరించడానికి సిద్ధమైంది. 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home