సన్‌, శాండ్‌, నవ్వులు.. ఆనందానికి ఇవి చాలు

రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడాని బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ‘ఆజాద్‌’తో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

అజయ్‌ దేవగణ్‌, అతడి మేనల్లుడు అమన్‌ దేవగణ్‌ కలసి నటిస్తున్న ‘ఆజాద్‌’కు అభిషేక్‌ కపూర్‌ దర్శకుడు.

రాషా 2005లో మహారాష్ట్రలో పుట్టింది. పెరిగిందంతా ముంబయిలో. ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదువుకుంది. 

కొరియన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ తైక్వాండోలో 2021లో బ్లాక్‌బెల్ట్‌ సాధించింది.

ఆర్ట్స్‌, సంగీతం, డ్యాన్స్‌ అంటే ఇష్టం. థియేటర్‌ ఆర్టిస్ట్ కూడా. నటి అవ్వాలనేది చిన్నతనం నుంచి ఆమె కల.

రవీనా, రాషా అక్కాచెళ్లెల్లలా ఉంటారని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు.

రాషా తరచూ తల్లితో కలసి ట్రిప్‌లకి వెళ్తుంది. ‘సన్‌, శాండ్‌, స్మైల్స్‌.. ఇవి చాలు ఈ ప్రపంచం నుంచి తప్పించుకోవడానికి..’ అని అంటోంది.

మహాశివుడు అంటే భక్తి ఎక్కువ. ఖాళీ సమయం దొరికితే వివిధ రాష్ట్రాల్లోని ఆలయాలు సందర్శిస్తుంది. దాని వల్ల ప్రశాంతంగా ఉంటుందంటోంది.

ఇన్‌స్టాలో రాషాను 13 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు.

తరచూ స్నేహితులతో కలసి పార్టీలు, ఫంక్షన్‌లకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంది. ముంబయిలో లైవ్‌ కన్సర్ట్‌లకు తప్పక వెళ్తుంది.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home