రవీనా.. అప్పటి ముచ్చట్లు!
బాలీవుడ్ నటి రవీనా టాండన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు బయటపెట్టి వార్తల్లో నిలిచారు.
Image: Instagram/Raveena Tondon
అప్పట్లో అక్షయ్‌కుమార్‌ను ప్రేమించానని చెప్పిన ఆమె కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల పెళ్లి జరగలేదని తెలిపారు.
Image: Instagram/Raveena Tondon
తను నటించిన సినిమాల్లో ఎలాంటి అసభ్యత ఉండకుండా చూసుకున్నానని, ముద్దు సన్నివేశాల్లోనూ నటించలేదని గుర్తు చేసుకున్నారు.
Image: Instagram/Raveena Tondon
అసభ్య సన్నివేశాల్లో నటించనని చెప్పడంతోనే ఎన్నో హిట్ సినిమా అవకాశాలను వదులుకున్నట్లు వివరించారు.
Image: Instagram/Raveena Tondon
‘ప్రేమ్ ఖైదీ (1991)’లో మొదట ఈమెనే సంప్రదించారట. అందులో రొమాంటిక్ సన్నివేశాలు నచ్చకపోవడంతో రవీనా ఒప్పుకోలేదు. ఈ చిత్రంతోనే కరిష్మా కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.
Image: Instagram/Raveena Tondon
తోటి హీరోయిన్లతో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నట్లు చెప్పిన రవీనా.. కరిష్మా కపూర్‌తో మాత్రం మైత్రి అంతగా లేదని వెల్లడించారు. కానీ, కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Image: Instagram/Raveena Tondon
తొంభై దశకంలో బీటౌన్ స్టార్ హీరోయిన్‌గా వెలిగొందిన రవీనా.. ఇప్పటికీ తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం సహాయక పాత్రలు పోషిస్తూ బిజీబిజీగా ఉన్నారు.
Image: Instagram/Raveena Tondon
పత్తర్ కే పూల్(1991)తో వెండితెరకు పరిచయమైన ఈ 90s బ్యూటీ.. ‘దిల్‌వాలే’, ‘లాడ్లా’, ‘అందాజ్ అప్నా అప్నా’, ‘మోహ్రా’, ‘మై ఖిలాడీ తు అనారీ’, ‘అనారీ నం.1’ ఇలా 80కిపైగా సినిమాల్లో నటించారు.
Image: Instagram/Raveena Tondon
టాలీవుడ్‌లో ‘రథ సారథి’, ‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశ వీధిలో’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మెరిశారు.
Image: Instagram/Raveena Tondon
కన్నడలో 1999లో ‘ఉపేంద్ర’లో నటించారు. ఇటీవల ‘కేజీఎఫ్ - 2’లో ప్రధానమంత్రి రమికా సేన్ పాత్ర పోషించి పాన్‌ఇండియా స్థాయిలో అలరించారు.
Image: Instagram/Raveena Tondon
పలు టీవీషోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన రవీనా.. వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు. తను నటించిన ‘అరణ్యక్’ వెబ్‌సిరీస్‌కు గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డు దక్కింది.
Image: Instagram/Raveena Tondon
సినీ ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులు అందుకున్న రవీనాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.
Image: Instagram/Raveena Tondon