సిల్క్‌స్మితగా చంద్రిక

అలనాటి నటి సిల్క్‌స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమా తెరకెక్కుతోంది. నటి చంద్రికా రవి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రికకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారత సంతతి కుటుంబంలో చంద్రికారవి జన్మించారు.

 మూడేళ్లకే ఆమె డ్యాన్సింగ్‌, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. 16 ఏళ్ల వయసులోనే మోడల్‌, నటిగా కెరీర్‌ మొదలుపెట్టారు.

కెరీర్‌లో రాణించాలనే ఉద్దేశంతో కుటుంబానికి దూరంగా లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లారు. అక్కడ ఆమె పలు టీవీ షోస్‌లో నటించారు.

2018లో విడుదలైన ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’తో ఆమె భారతీయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

2019లో వచ్చిన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’కు ఇది రీమేక్‌.

This browser does not support the video element.

‘వీర సింహారెడ్డి’లో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ పాట తర్వాత ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్‌ పెరిగింది.

చంద్రికకు భారతదేశం అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ స్థిరపడాలని ఉందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

కెరీర్‌ నిమిత్తం కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం తనకెంతో బాధగా ఉంటుందన్నారు.

సిల్క్‌ స్మిత బయోపిక్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని.. ఆ సినిమా కోసం తాను శ్రమిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ సినిమా కోసం చంద్రిక ఎంతో రీసెర్చ్‌ చేశారు. స్మిత నటించిన చిత్రాలు చూడటం.. ఆమె కుటుంబసభ్యులను కలిసి పలు విషయాలు తెలుసుకున్నారు.

ఆయనే నా డ్యాన్స్‌ టీచర్‌

మేనమామే అయినా 17 సార్లు ఆడిషన్‌ ఇచ్చింది!

యూట్యూబ్‌ నుంచి కేన్స్‌ దాకా..

Eenadu.net Home