జడ్డూ భాయ్‌.. 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌

ప్రపంచంలోనే టాప్‌ ఆల్‌రౌండర్.. రవీంద్ర జడేజా. ఈ అభిప్రాయం అభిమానులదే కాదు.. క్రికెటర్లది కూడా!

జడేజా క్రికెట్‌ కెరీర్‌కు 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2009 ఫిబ్రవరి 8న తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ ఆడాడు.

ఇప్పటి వరకు 197 వన్డేలు ఆడాడు. మొత్తం 2,756 పరుగులు, 220 వికెట్లు తీశాడు. 13 హాఫ్ సెంచరీలు చేశాడు.

కెరీర్‌లో 69 టెస్టులు ఆడిన జడ్డూ.. 2,893 పరుగులు, 280 వికెట్లు తీశాడు. మూడు సెంచరీలు బాదాడు. 

66 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. 480 పరుగులు చేసిన జడేజా.. 53 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌లో 226 మ్యాచ్‌లు ఆడి.. 2,692 పరుగులు చేశాడు. 152 వికెట్లు తీశాడు.

2016 ఏప్రిల్ 17న రివాబా సోలంకీతో వివాహం జరిగింది. ఆమె ఇప్పుడు గుజరాత్‌లో అధికార భాజపా ఎమ్మెల్యే.

ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజాదే అగ్రస్థానం.

జడేజాను ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్లు, ట్విటర్‌లో 5.3 మిలియన్ల మంది ఫాలో అవుతారు.

IPL వేలం: ఈ ఏడాది టాపర్‌ పంత్‌.. మరి గతంలో?

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

Eenadu.net Home