రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పెషల్ ఎడిషన్.. 25 బైకులు మాత్రమే!
రాయల్ ఎన్‌ఫీల్డ్.. షాట్‌గన్ 650 మోటోవెర్స్ ఎడిషన్ బైక్‌ను విడుదల చేసింది. ఇది లిమిటెడ్ ఎడిషన్.
ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.4.25 లక్షలుగా నిర్ణయించారు.
EICMA 2021 ఈవెంట్‌లో తొలుత దీని కాన్సెప్ట్‌ను ప్రదర్శించారు. లక్కీ డ్రాలో ఎంపికైన 25 మందికి జనవరిలో డెలివరీ చేయనున్నారు.
వచ్చే ఏడాది నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ వీటిని పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయనుంది.
650cc సెగ్మెంట్‌లో ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జీటీ, సూపర్ మెటోర్ 650 వాహనాలు ఉన్నాయి. షాట్‌గన్ 650 నాలుగోది.
ఇందులోని 648సీసీ ఇంజిన్ 52 Nm టార్క్.. 47 bhp శక్తిని విడుదల చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది.
మెటోర్ 650 తరహాలోనే దీనిలో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ కన్సోల్ ఉంది.
నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS కూడా ఉంది.