భారత మార్కెట్లోకి రియల్‌మీ 10.. ఫీచర్లివే!
భారత మొబైల్ మార్కెట్లోకి తాజాగా బడ్జెట్ ధరలో రియల్‌మీ 10 విడుదలైంది. వివరాలివిగో..
Image: Realme
ఇందులో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు.
Image: Realme
మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ను వాడారు. దాంతోపాటు రెండు ఆర్మ్ కార్టెక్స్-ఏ76 చిప్‌సెట్స్‌తో కూడిన ఆక్టా-కోర్ సీపీయూ ఉంది.
Image: Realme
4 జీబీ ర్యామ్/64 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. ర్యామ్‌ను వర్చువల్‌గా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.
Image: Realme
వెనకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ సెన్సర్ కెమెరా అమర్చారు. ముందుభాగంలో 16 ఎంపీ కెమెరా ఉంది.
Image: Realme
దీంట్లో 33 వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కాల్ మాట్లాడితే 30 గంటలు, మ్యూజిక్ వింటే 50 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుందని సంస్థ చెబుతోంది.
Image: Realme
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ3.0 ఓఎస్‌తో పనిచేసే ఈ 4జీ మొబైల్‌లో అల్ట్రాబూమ్ స్పీకర్స్ ఉన్నాయి.
Image: Realme
4జీబీ వేరియంట్ ధర రూ. 12,999 కాగా.. 8జీబీ వేరియంట్ ధర రూ. 16,999గా ఉంది.
Image: Realme
క్లాస్ వైట్, రష్ బ్లాక్ రంగుల్లో లభ్యమయ్యే ఈ మొబైల్ విక్రయాలు.. ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర మొబైల్ స్టోర్లలో జనవరి 15 నుంచి మొదలవుతాయి.
Image: Realme