మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌మీ 5జీ ట్యాబ్‌!

రియల్‌మీ సంస్థ తాజాగా ‘ప్యాడ్‌ ఎక్స్‌’ పేరుతో 5జీ ట్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Image: Realme

ఇందులో బ్లూ లైట్‌ ప్రొటెక్షన్‌తో 10.95 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు.

Image: Realme

స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ను వాడారు. డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Realme

వెనుకవైపు 13 ఎంపీ కెమెరా ఉంది. వీడియోకాల్స్‌, సెల్ఫీల కోసం ముందు భాగంలో 105-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8 ఎంపీ కెమెరా అమర్చారు.

Image: Realme

ఈ ట్యాబ్‌లో 8,340ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 33 వాట్‌ డార్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Realme

ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఓఎస్‌తో పనిచేస్తుంది.

Image: Realme

6 జీబీ ర్యామ్‌ వేరియంట్‌లో అదనంగా 5 జీబీ, 4 జీబీ ర్యామ్‌ వేరియంట్‌లో అదనంగా 3 జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. 

Image: Realme

గ్లేసియర్‌ బ్లూ, గ్లోయింగ్‌ గ్రే రంగుల్లో ఈ ట్యాబ్‌ లభిస్తోంది.

Image: Realme

ప్యాడ్‌ ఎక్స్‌ 4 జీబీ / 64 జీబీ వైఫై వేరియంట్‌ ధర రూ. 19,999గా ఉండగా.. 5జీ వేరియంట్‌ ధర రూ. 25,999గా ఉంది. 6 జీబీ / 128 జీబీ 5జీ వేరియంట్‌ ధర రూ. 27,999.

Image: Realme

ట్యాబ్ కోసం రియల్‌మీ ప్రత్యేకంగా పెన్సిల్‌ను తయారు చేసింది. దీన్ని విడిగా కొనాల్సి ఉంటుంది. ధర రూ. 5,499గా ఉంది.

Image: Realme

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home