మొబైల్‌ ఫోన్‌ పేలడానికి కారణాలివీ..!

బ్యాటరీ ఉబ్బినా మొబైల్‌ను అలాగే ఉపయోగిస్తే అది పేలే ప్రమాదముంది.

Image: RKC

మొబైల్‌ కిందపడ్డప్పుడు బ్యాటరీ డ్యామేజ్‌ కావొచ్చు. గమనించి బ్యాటరీ మార్చకుంటే అంతే సంగతులు.

Image: RKC

మొబైల్‌తోపాటు వచ్చే ఛార్జర్‌నే వాడాలి. అలా కాకుండా నకిలీ ఛార్జర్‌ వాడితే బ్యాటరీ లైఫ్‌ తగ్గడమే కాదు.. పేలుడూ సంభవించొచ్చు.

Image: RKC

ఛార్జరే కాదు యూఎస్‌బీ కేబుల్‌ కూడా ఒరిజనల్‌దే వాడాలి. థర్డ్‌ పార్టీ కేబుల్స్‌ వాడితే బ్యాటరీ దెబ్బతిని పేలుతుంది.

Image: RKC

బ్యాటరీ లైఫ్ అయిపోతే బ్యాటరీ మార్చుకోవచ్చు. అయితే, కంపెనీ బ్యాటరీ కాకుండా నకిలీవి, నాణ్యత లేనివి అమర్చుకుంటే అవి పేలే అవకాశముంది.

Image: RKC

ప్రస్తుతం కంపెనీలు మొబైల్‌ ఓవర్‌ ఛార్జింగ్‌ను నివారించేలా సాంకేతికతను తీసుకొచ్చాయి. అయినా.. ఎక్కువ సేపు ఛార్జింగ్‌ పెడితే.. బ్యాటరీపై ప్రభావం పడుతుంది. అది పేలుడుకు దారి తీయొచ్చు.

Image: RKC

మొబైల్స్‌ కొంత మేరకే ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మొబైల్‌ను ఉంచినట్లయితే అవి పేలే ప్రమాదముంది.

Image: RKC

మొబైల్‌ కంపెనీకి చెందిన స్టోర్స్‌లోనే రిపేర్‌ చేయించాలి. నైపుణ్యంలేని వారి వద్ద రిపేర్‌ చేయిస్తే.. కొత్త సమస్యలు తలెత్తి బ్యాటరీ డ్యామేజ్‌ కావొచ్చు.

Image: RKC

ఛార్జింగ్‌ పెట్టి.. ఫోన్‌లో మాట్లాడటం లేదా గేమ్స్‌ ఆడటం చేయొద్దు. అలా చేస్తే మొబైల్‌ వేడేక్కి పేలొచ్చు.

Image: RKC

ఫొటోలో టెక్ట్స్‌నూ ట్రాన్స్‌లేట్ చేయొచ్చు

ఫోన్‌లో ఏ పార్ట్‌ ఎక్కడిదో తెలుసా..?

మీ పాస్‌వర్డ్‌ ఎంత స్ట్రాంగ్‌

Eenadu.net Home