ఈ క్రికెటర్ల జెర్సీ నంబర్ల వెనకున్న కథ ఇదే..
హార్దిక్ పాండ్య
అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో హార్దిక్ అత్యధిక స్కోరు 228. దీనికి గుర్తుగా కొన్నాళ్లు 228ను ఉపయోగించిన అతడు సంఖ్యాశాస్త్రంపై నమ్మకంతో 33కి మారాడు.
source:Eenadu
రాహుల్ ద్రవిడ్
కెరీర్ ఆరంభంలో 5 నంబర్ జెర్సీని ధరించిన ద్రవిడ్.. ఓ జ్యోతిషుడి సూచన ప్రకారం 5 నుంచి 19 నంబర్‌కి మారాడు.
source:Eenadu
రోహిత్ శర్మ
అండర్-19 ప్రపంచ కప్ నుంచి రోహిత్ శర్మ తన జెర్సీపై 45 నంబర్‌ను వాడుతున్నాడు. తన తల్లి సూచన మేరకు ఆ నంబర్‌ను ఎంచుకున్నాడు.
source:Eenadu
యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ 12 నంబర్ జెర్సీని ధరించేవాడు. ఇందుకు కారణం అతడి పుట్టిన రోజు. 1981 డిసెంబరు 12న 12 గంటలకు అతడు జన్మించాడు.
source:twitter
సౌరభ్ గంగూలీ
సౌరభ్ గంగూలీ తరచూ జెర్సీ నంబర్‌ను మార్చేవాడు. కొన్నాళ్లు జెర్సీపై 1, 99 నంబర్లను ధరించాడు. 2003 ప్రపంచ కప్ సమయంలో ఓ జ్యోతిషుడి సూచనతో 24 నంబర్‌కి మరాడు.
source:twitter
ఎం.ఎస్. ధోనీ
ధోనీ పుట్టిన తేదీ, లక్కీ నంబర్ 7. అతడి అభిమాన ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ జెర్సీ నంబర్ 7. ఈ కారణంగానే ఆ అంకెను ఎంచుకున్నాడు.
source:twitter
విరాట్ కోహ్లీ
తన తండ్రి పుట్టిన రోజుకు గుర్తుగా కెరీర్ ఆరంభం నుంచీ విరాట్ కోహ్లీ 18 నంబర్ జెర్సీనే ధరిస్తున్నాడు.
source:twitter
సచిన్ తెందూల్కర్
కెరీర్ ఆరంభంలో 99 నంబర్ జెర్సీని ధరించిన సచిన్.. ఇంటిపేరు (10దూల్కర్) కలిసి వస్తుందని 10 నంబర్‌కి మారాడు.
source:twitter