టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్‌.. శ్రీవిష్ణుతో ‘విజిల్‌’ భామ!

రెబా మోనికా జాన్‌.. పేరు చెబితే టాలీవుడ్‌ ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు. అదే విజయ్‌‘విజిల్‌(తమిళ్‌ బిగిల్‌)’లో యాసిడ్‌దాడి బాధితురాలిగా నటించిన అనిత అంటే గుర్తుపట్టేస్తారు.

Image: Instagram/Reba Monica John

‘విజిల్‌’లో ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా ఆకట్టుకున్న రెబా.. తొలిసారిగా తెలుగు చిత్రంలో నటిస్తోంది.

Image: Instagram/Reba Monica John

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతోన్న‘సామజవరగమన’ మే 18న విడుదలకానుంది. ఇందులో శ్రీవిష్ణుకి జోడీగా రెబా నటిస్తోంది.

Image: Instagram/Reba Monica John

బెంగళూరులో 1994 ఫిబ్రవరి 4న మలయాళీ కుటుంబంలో జన్మించింది రెబా. ఈమె.. హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌కి కజిన్‌.

Image: Instagram/Reba Monica John

కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చదువుకున్న రెబా.. మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. కొన్ని బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లోనూ నటించింది.

Image: Instagram/Reba Monica John

మాలీవుడ్‌లో విడుదలైన‘జాకోబింటే స్వర్గరాజ్యం(2016)’లో చిన్న పాత్ర పోషించిన రెబాకు మలయాళంతోపాటు తమిళ్‌లోనూ అవకాశాలొచ్చాయి. 

Image: Instagram/Reba Monica John

ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే.. పలు సినిమాల్లో అతిథి పాత్రలు, సహాయక పాత్రలు చేస్తోంది.

Image: Instagram/Reba Monica John

ఓటీటీల కోసం కన్నడలో ‘రత్న ప్రపంచ’, తమిళ్‌లో ‘ఇన్నలే వారె’, ‘ఆకాశవాణి’లో నటించింది.

Image: Instagram/Reba Monica John

తను వేసుకునే దుస్తులకంటే.. తను నటించిన పాత్రలే ప్రేక్షకులకు గుర్తుండాలని, అలాంటి పాత్రలే చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రెబా. 

Image: Instagram/Reba Monica John

రెబాది ప్రేమ వివాహం. తన ప్రియుడు జోయిమన్‌ జోసెఫ్‌ను గతేడాది వివాహమాడింది.

Image: Instagram/Reba Monica John

ఈ బెంగళూరు బ్యూటీకి సోషల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో ఈమెకి 1.8 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. 

Image: Instagram/Reba Monica John

ఎప్పటికప్పుడు తన సినిమా సంగతులతోపాటు వ్యక్తిగత విషయాలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటోంది. 

Image: Instagram/Reba Monica John

రెబాకి విహారయాత్రలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. దేశీయ టూరిస్ట్‌ ప్రాంతాల్నే కాదు.. దుబాయి, బార్సిలోనా, మిలాన్‌, న్యూయార్క్‌, చికాగో, లాస్‌ వెగాస్‌, కొలంబో ఇలా విదేశాల్లోని సందర్శక ప్రాంతాల్నీ చుట్టొచ్చింది. 

Image: Instagram/Reba Monica John

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home