అలిలా కోటలో ‘రాయల్’గా
అదితి- సిద్ధార్థ్
ఈ ఏడాది సెప్టెంబర్‌లో వివాహ బంధంలో అడుగుపెట్టారు.. సిద్ధార్థ్, అదితీ రావు హైదరీ. తాజాగా ఈ జంట ఫొటోషూట్ వైరల్‌గా మారింది.
తెలంగాణ వనపర్తిలోని 400 ఏళ్లనాటి శ్రీరంగనాయక స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు.
తాజాగా.. 230 ఏళ్లనాటి రాజస్థాన్ బిషార్‌ఘర్‌లోని అలిలా లగ్జరీ కోటలో రెండో సారి వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ట్రెండ్ అవుతోంది.
దీనికి సంబంధించిన ఫొటోలను అదితి తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది.
‘జీవితంలో గొప్ప విషయం ఏంటంటే.. జీవితాంతం ఒకరి చేతిని ఇంకొకరు పట్టుకొని ఉండటమే..’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
చెట్టు కింద లైటింగ్, పూల అలంకరణతో డెకరేషన్ చేసిన మండంపం మీద దండలు మార్చుకున్నారు. దీన్ని రాయల్ వెడ్డింగ్ సెర్మనీగా పేర్కొన్నారు.
వీరి వెడ్డింగ్ పార్టీ కోసం ప్రత్యేకమైన దుస్తులను సవ్యసాచి టీమ్ డిజైన్ చేసింది.
పెద్ద బార్డర్ ఉన్న ఎరుపు రంగు లెహంగాలో పెళ్లికూతురిగా మెరిసిపోతోంది అదితి. సిద్ధార్థ్ క్రీమ్ కలర్ షేర్వాణీలో క్లాసీలుక్‌లో కనిపించాడు.
ఈ ఏడాది దీపావళి నాడు సిద్ధార్థ్- అదితి వివాహ బంధాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు.