పెళ్లి పీటలెక్కిన స్వర భాస్కర్‌!

బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌.. వివాహబంధంలోకి అడుగుపెట్టింది. రాజకీయవేత్త ఫాహద్‌ అహ్మద్‌ను ఆమె ప్రేమించి పెళ్లాడింది. 

Image: Instagram/swara bhaskar

తాజాగా ఈ విషయాన్ని తనే సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. 

Image: Instagram/swara bhaskar

ఫాహద్‌తో అనుకోకుండా జరిగిన పరిచయం.. స్నేహంగా ఆ తర్వాత ప్రేమబంధంగా మారిందని చెబుతూ ఓ వీడియోని పోస్టు చేసింది. 

Image: Instagram/swara bhaskar

ఈ బాలీవుడ్‌ బ్యూటీ 1988 ఏప్రిల్‌ 9న దిల్లీలో జన్మించింది. ఈమె తండ్రి ఉదయ్‌ భాస్కర్‌ తెలుగువారే. నేవీ ఆఫీసర్‌గా పనిచేశారు. 

Image: Instagram/swara bhaskar

దేశ రాజధానిలో పుట్టి పెరిగిన స్వర.. దిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చదివి.. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో పీజీ పూర్తి చేసింది. 

Image: Instagram/swara bhaskar

సినిమాల్లోకి రాకముందు స్వర.. దిల్లీలో థియేటర్‌ గ్రూప్‌తో కలిసి పనిచేసేది. 2008లో ముంబయికి మకాం మార్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. 

Image: Instagram/swara bhaskar

అలా 2009లో ‘మధోలాల్‌ కీప్‌ వాకింగ్‌’లో నటించింది. ఈ సినిమా థియేటర్లలో నిరాశపర్చినా.. అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది.

Image: Instagram/swara bhaskar

ఆ తర్వాత సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గుజారిష్‌’లో సహాయ పాత్ర పోషించింది. కానీ, పెద్దగా గుర్తింపు దక్కలేదు. 

Image: Instagram/swara bhaskar

‘తను వెడ్స్‌ మను’లో సహాయక పాత్రలో స్వర నటనకు మంచి గుర్తింపు లభించింది. దీంతో అవకాశాలు వెల్లువెత్తాయి.

Image: Instagram/swara bhaskar

అక్కడి నుంచి హీరోయిన్‌, సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వస్తోంది. పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. 

Image: Instagram/swara bhaskar

కరీనా కపూర్‌, సోనమ్‌ కపూర్‌, శిఖా తస్లీమాతో కలిసి స్వర నటించిన ‘వీర్‌ ది వెడ్డింగ్‌’ హిట్‌ కావడమే కాదు.. స్వర నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 

Image: Instagram/swara bhaskar

ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే స్వర.. వర్తమాన సినీ, సామాజిక, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటుంది. తనను విమర్శించే వారికి గట్టిగానే సమాధానమిస్తుంటుంది.  

Image: Instagram/swara bhaskar

ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సిటిజన్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ గతంలో నిరసన వ్యక్తం చేసింది. మరెన్నో అంశాల్లో తన అభిప్రాయాల్ని వ్యక్తపర్చి వివాదాలకు కేంద్రంగా నిలిచింది. 

Image: Instagram/swara bhaskar

ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో’ యాత్రలో పాల్గొని.. ఆయనతో కలిసి నడిచింది.

Image: Instagram/swara bhaskar

గతేడాది ‘జహాన్‌ చార్‌ యార్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన స్వర.. ప్రస్తుతం ‘మిర్సెస్‌ ఫలని’లో నటిస్తోంది. 

Image: Instagram/swara bhaskar

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home