కోల్‌కతా - హైదరాబాద్‌.. క్వాలిఫయర్‌ - 1 రికార్డులివే

ఐపీఎల్ 17వ సీజన్‌ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కోల్‌కతా విజయం సాధించింది. కేకేఆర్‌ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..

ప్లేఆఫ్స్‌లో కెప్టెన్‌గా అత్యధిక హాఫ్‌ సెంచరీలు (2) చేసిన నాలుగో ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్. ధోనీ (2), రోహిత్ (2), వార్నర్ (2)తో సమంగా నిలిచాడు.

అత్యధికసార్లు ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన మూడో జట్టు కోల్‌కతా. ఇప్పుడీ సీజన్‌తో కలిపి 4సార్లు తుది పోరుకు చేరింది. అందరికంటే చెన్నై (10) ముందుంది.

వెంకటేశ్‌ అయ్యర్ ప్లేఆఫ్స్‌లో స్కోర్లు ఇలా.. 26, 55, 50, 51*పరుగులు సాధించాడు. మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

ఐపీఎల్‌లో 160+ స్కోరు ఛేదనను అత్యధిక బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసిన రెండో జట్టు కోల్‌కతా. ఎస్‌ఆర్‌హెచ్‌పై 38 బంతులు ఉండగానే గెలిచింది. ఇదే సీజన్‌లో లఖ్‌నవూపై హైదరాబాద్‌ (62 బంతులు) భారీ విజయం సాధించింది.

ఐపీఎల్‌లో పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన రెండో జోడీ కమిన్స్ - వియస్కాంత్. వీరిద్దరూ కలిసి 33 పరుగులు జోడించారు. 2023 సీజన్‌లో ధావన్ - రాథీ 55 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు.

ప్లేఆఫ్స్‌లో కోల్‌కతా తరఫున అత్యధిక భాగస్వామ్యం నిర్మించిన రెండో జోడీగా శ్రేయస్ - వెంకటేశ్‌ అయ్యర్ నిలిచింది. వీరిద్దరూ హైదరాబాద్‌పై 97 పరుగులు జోడించారు. బిస్లా - కలిస్ 2012లో 136 పరుగులు రాబట్టారు.

వరుసగా రెండో సీజన్‌లోనూ వరుణ్‌ చక్రవర్తి 20 వికెట్ల ప్రదర్శన చేశాడు. 2023 సీజన్‌లోనూ ఇరవై వికెట్లు తీశాడు. 

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home