‘పుష్ప 1’.. అరుదైన రికార్డులు
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వరించింది. టాలీవుడ్ చరిత్రలో ఈ పురస్కారం దక్కిన తొలి హీరో
ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌కు నేషనల్ అవార్డు దక్కింది
ఏడు ఫిల్మ్‌ఫేర్, ఏడు సైమా అవార్డులు వచ్చాయి
ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.360 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. హిందీలోనే రూ. 108 కోట్లు (నెట్) కలెక్షన్స్ రాబట్టింది
ఇప్పటి వరకూ అత్యధిక వసూలు (గ్రాస్) చేసిన టాలీవుడ్ చిత్రాల్లో 8వ స్థానంలో ఉంది
ఈ ఏడాది నిర్వహించిన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శితమైంది
మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ మూవీ, ఆ తర్వాత రష్యన్‌లో డబ్ అయింది.
యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లో (2021) అత్యధిక మంది (దాదాపు 22M) చూసిన, లైక్ చేసిన వీడియో ‘పుష్ప’ టీజర్
2022లో.. యూట్యూబ్‌లో 6 బిలియన్+ వ్యూస్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ఆల్బమ్ ‘పుష్ప’
‘పుష్ప’ డైలాగ్స్, పాటలతో ఇన్‌స్టాలో 10 మిలియన్+ రీల్స్ క్రియేట్ కావడం విశేషం
2022లో ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఎక్కువ మంది చూసిన చిత్రమిదే.
‘దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ (2022) అవార్డు అందుకుంది