బడ్జెట్‌ శ్రేణిలో రెడ్‌మీ కొత్త ఫోన్‌

బడ్జెట్‌ ధరలో రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ పేరుతో కొత్త ఫోన్‌ భారత మార్కెట్లోకి విడుదలైంది.

image:Redmi

ఏప్రిల్‌లో విడుదలైన రెడ్‌మీ 10ఏకు కొనసాగింపుగా రెడ్‌మీ 10ఏ స్పోర్ట్‌ను తీసుకొచ్చారు.

image:Redmi

ఆండ్రాయిడ్ ఆధారిత ఎమ్‌ఐయూఐ 12.5 ఓఎస్‌తో పనిచేస్తుంది.

image:Redmi

రెడ్‌మీ 10ఏ స్పోర్ట్‌ 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్‌ డిస్‌ప్లేతో వస్తోంది. వెనుకవైపు ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఉంది.

image:Redmi

మీడియాటెక్‌ హీలియో జీ25 ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించారు.

image:Redmi

ఫోన్‌ వెనుకవైపు 13 ఎంపీ కెమెరా, ముందు వీడియో కాలింగ్‌, సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరా అమర్చారు.

image:Redmi

రెడ్‌మీ 10ఏ స్పోర్ట్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 10 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

image:Redmi

6 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో దీనిని తీసుకొచ్చారు. ధర ₹ 10,999. అమెజాన్‌, ఎమ్‌ఐ.కామ్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు.

image:Redmi

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home