సొగసుల ‘ఢాకిని’.. రెజీనా

గత కొంతకాలంగా కోలీవుడ్‌లో వరస సినిమాలతో దూసుకుపోతున్న రెజీనా కసాండ్రా టాలీవుడ్‌లోనూ జోరు పెంచింది.

Image:Instagram/Regina Cassandra

‘శాకిని ఢాకినీ’తో మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ చిత్రం సెప్టెంబరు 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా రెజీనా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

Image:Instagram/Regina Cassandra

రెజీనా 1990 డిసెంబర్‌ 13న చెన్నైలో జన్మించింది. ‘కాండ నాల్ ముదల్’ అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసింది. అప్పటికి ఈమె వయసు 14 ఏళ్లే.

Image:Instagram/Regina Cassandra

‘ఎస్‌.ఎమ్‌.ఎస్‌’తో టాలీవుడ్‌కి పరిచయమై అనేక చిత్రాల్లో కథానాయికగా ప్రేక్షకుల్ని అలరించింది.

Image:Instagram/Regina Cassandra

‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’,‘జ్యో అచ్యుతానంద’,‘అ!’, ‘రా రా కృష్ణయ్య’, ‘ఎవరు’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image:Instagram/Regina Cassandra

ఈ ఏడాది విడుదలైన ‘ఆచార్య’లో ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అనే ప్రత్యేక గీతంలో చిరుతో కలిసి స్టెప్పులేసింది.

Image:Instagram/Regina Cassandra

రెజీనా ఎక్కడికి వెళ్లినా అక్కడి స్పెషల్ ఫుడ్‌ని రుచి చూస్తుందట. అలా చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌, ఫ్రెంచ్‌.. ఇలా అన్ని డిష్‌లు ట్రై చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Image:Instagram/Regina Cassandra

‘తెలుగులో చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ అంటే ఇష్టం. రజనీకాంత్‌ నా ఆల్‌టైం ఫేవరెట్‌’ అని ఓ సందర్భంలో వెల్లడించింది.

Image:Instagram/Regina Cassandra

తమిళంలో రెజీనా మొదటి సినిమా ‘కేడి బిల్లా కిలాడి రంగ’. అందులో ‘పాప’ అనే పాత్రలో నటించి బాగా ఫేమస్‌ అయ్యింది. ఇప్పటికీ చాలామంది చెన్నైలో ఆమెను ‘పాప’ అనే పిలుస్తారు.

Image:Instagram/Regina Cassandra

ప్రస్తుతం రెజీనా చేతిలో మూడు సినిమాలు, రెండు వెబ్‌సిరీస్‌లున్నాయి.

Image:Instagram/Regina Cassandra

యుజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ టాలీవుడ్‌లో ఎంట్రీ!

ఈషా శారీ లుక్స్‌.. సోషల్‌ మీడియా షేక్స్‌..

వన్ ఉమెన్ బ్యాండ్.. జస్లిన్‌ రాయల్‌

Eenadu.net Home