ఓటు హక్కు పొందడం ఎలా?

అర్హులైన ప్రతి ఒక్కరూ భారత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పొందొచ్చు. 18 ఏళ్ల యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకొనేందుకు అర్హులు. ఇప్పటి వరకు ఓటు హక్కు లేని వారు నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

Image : eenadu

ఓటుహక్కు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే వజ్రాయుధం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326లో పేర్కొన్నారు.

Image : eenadu

కళాశాల యువతకు జనవరి ఒకటి నాటికి 17 ఏళ్లు పూర్తయితే ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే వీలు ఎన్నికల సంఘం కల్పించింది. 

Image : eenadu

ఓటు హక్కు కోసం రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికల బూత్‌ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవడం, లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం.

Image : eenadu

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ https://www.nvsp.in/లో చేసుకోవచ్చు. ఇందులో ఆన్‌లైన్‌ ఓటర్‌ పోర్టల్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి.. మీ మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. 

Image : eenadu

రిజిస్టర్‌ చేసుకొని లాగిన్‌ అయిన తర్వాత రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేయాలి. 6,7,8,8ఏ నంబర్లతో దరఖాస్తులుంటాయి. ఇందులో ఆరో నంబరు.. కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకోవడానికి ఉద్దేశించినది.

Image : eenadu

ఆ దరఖాస్తులో వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత సబ్‌మిట్‌ బటన్‌ నొక్కాలి. వెంటనే రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్లు మీ మొబైల్‌ నంబరుకు సందేశం వస్తుంది. దీన్ని సమీపంలోని ఎన్నికల నమోదు అధికారికి చూపించాలి.

Image : eenadu

ఆ అధికారులు ఇంటికి వచ్చి మీరు అర్హులో.. కాదో పరిశీలిస్తారు. అనంతరం వివరాలన్నీ సరిగా ఉంటే దరఖాస్తును అంగీకరిస్తారు.

Image : eenadu

కొద్దిరోజులకు ఓటరు గుర్తింపు కార్డు జారీ చేస్తారు. అది నిర్దేశిత చిరునామాకు పోస్టులో పంపిస్తారు. లేకుంటే మీరే ఆన్‌లైన్‌లో తీసుకోవడానికి వీలుంది.

Image : eenadu 

ఓటు ఒక చోట.. నివాసం మరో చోట ఉంటే కూడా మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. 

Image : eenadu 

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(03-02-2023/2)

Eenadu.net Home